Site icon NTV Telugu

Hydra: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!

Hydra

Hydra

హైదరాబాద్ నగరం కొండాపూర్ ప్రాంతంలో ఉన్న జంగంకుంట ఆక్రమణలపై హైడ్రా (HYDRA) భారీ ఆపరేషన్ చేపట్టింది. సుమారు రూ.700 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడుతూ.. అక్రమ కబ్జాదారులపై కఠిన చర్యలు చేపట్టింది. శేరిలింగం పల్లి మున్సిపల్‌ కార్యాలయం-మదీనగూడ మార్గంలో జంగమోనికుంటకు సంబంధించిన 4 ఎకరాల భూమిని కబ్జాదారులు ఆక్రమించారు. సర్వే నెంబర్ 134 పరిధిలో ఉన్న జంగమోనికుంటను పూర్తిగా మాయం చేస్తూ.. ఆక్రమణదారులు మట్టితో నింపి చదును చేసినట్లు అధికారులు గుర్తించారు.

Also Read: POVA Curve 2 5G: 8000mAh బ్యాటరీ, ట్రిపుల్ కెమెరా సెటప్.. బడ్జెట్ తక్కువ, ఫీచర్స్ ఎక్కువ!

జంగమోనికుంట చెరువును నాశనం చేసి భూమిని ప్లాట్లుగా విభజించి అమ్మకానికి సిద్ధం చేసినట్లు హైడ్రా గుర్తించింది. ఈ అక్రమాలపై ఇప్పటికే రెవెన్యూ అధికారులు కబ్జాదారులపై కేసులు నమోదు చేశారు. హైడ్రా బృందం రెవెన్యూ అధికారులతో కలిసి జంగమోనికుంట వద్ద జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించి, భూమి స్థితిగతులను పూర్తిగా పరిశీలించింది. అక్రమ కబ్జాలను పూర్తిగా అరికట్టేందుకు పోలీసుల సహకారంతో చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసే పనులను హైడ్రా సిబ్బంది ప్రారంభించింది. భవిష్యత్తులో మళ్లీ ఎలాంటి ఆక్రమణలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములు, జల వనరులను రక్షించడమే లక్ష్యంగా హైడ్రాపై ప్రజల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

Exit mobile version