HYDRA: పాతబస్తీలో 7 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా..
- పాతబస్తీలో 7 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
- రూ.400 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు
- సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లో చెరువు ఉన్నట్టు నిర్ధారణ
- కుమ్మరి వాడి పీస్ వెల్ఫేర్ సొసైటీ నుంచి అభినందనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా కబ్జాదారుల నుంచి వందలాది ఎకరాలను స్వాధీనం చేసుకుని రక్షిస్తోంది. ప్రభుత్వ స్థలాలు, నాలాలు, చెరువులు, బఫర్ జోన్ లోని స్థలాలను కబ్జాదారుల చెరనుంచి కాపాడుతోంది. ఈ క్రమంలో పాతబస్తీలో 7 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. రూ.400 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీసుల సమక్షంలో అక్రమ ప్రహారీలను హైడ్రా సిబ్బంది తొలగించారు. ప్రభుత్వ భూమి అని స్పష్టంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు. సర్వే నం.28లో మొత్తం 9.11 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు తెలిపారు.
ఇప్పటికే 2 ఎకరాల్లో నివాసాల నిర్మాణం.. నివాసాల జోలికి వెళ్లని హైడ్రా.. మిగిలిన 7 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు.. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లో చెరువు ఉన్నట్టు నిర్ధారణ అయినట్లు తెలిపారు. చెరువును మట్టితో పూడ్చి అక్రమ ఆక్రమణలకు పాల్పడినట్లు గుర్తించారు. భవానీపురం పోలీస్ స్టేషన్‌లో కబ్జాదారులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కోర్టు కోటి రూపాయల ఫైన్ విధించినా కబ్జాదారులు మారలేదు. ప్లాట్లుగా మార్చి అమ్మే ప్రయత్నాన్ని హైడ్రా అడ్డుకున్నది. సున్నితమైన ప్రాంతంలో వివాదాలకు చెక్ పెట్టింది. హైడ్రా చర్యలతో ఊపిరి పీల్చుకున్నారు స్థానికులు.. కుమ్మరి వాడి పీస్ వెల్ఫేర్ సొసైటీ నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. నాలా, కుంట పునరుద్ధరిస్తే వరద ముప్పు తగ్గుతుందని సూచించారు. హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
Also Read
- YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్‌కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
- Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
- Aus vs Ban: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు డౌన్.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
తాజావార్తలు
-
AirAsia: ఆలస్యమైన విమానం.. రైతు అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతినడంతో రూ. 90 వేల నష్టపరిహారం
-
Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్… స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్‌కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
-
TATA Sierra EV: టాటా సియెర్రా ఈవీ రిలీజ్ కు రెడీ..! 500KM రేంజ్, ప్రీమియం ఫీచర్లు
-
Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
ట్రెండింగ్
-
Fact Check: హీరోయిన్‌తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..