Site icon NTV Telugu

Hydra Prajavani: నేడు బుద్ధ భవన్‌లో హైడ్రా ప్రజావాణి!

Hydra Prajavani

Hydra Prajavani

ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని రాణిగంజ్‌లోని బుద్ధ భవన్‌లో ఉన్న హైడ్రా కార్యాలయంలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు (జనవరి 27) బుద్ధ భవన్‌లో హైడ్రా ప్రజావాణి కార్యక్రమం జరగనుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 వరకు ఫిర్యాదులు తీసుకుంటారు. ఫిర్యాదుకు సంబంధించిన తగిన ఆధార పత్రాలతో పాటు పూర్తి వివరాలను ఫిర్యాదుదారులు తీసుకెళ్లాల్సి ఉంటుంది. హైడ్రా ప్రజావాణికి మద్దతు భారీగా పెరిగింది.

Also Read: Hussain Sagar: హుస్సేన్‌ సాగర్‌లో అగ్ని ప్రమాదం.. యువకుడు మిస్సింగ్!

జనవరి 6న హైడ్రా ప్రజావాణి ఆరంభం అయింది. హైడ్రా అధికారులు మొదటి వారం 83 ఫిర్యాదులు స్వీకరించారు. రెండవ వారం నిర్వహించిన ప్రజావాణిలో 89 ఫిర్యాదులు స్వీకరించారు. నేరుగా హైడ్రా కమిషనర్‌కే ఫిర్యాదు చేసే అవకాశం ఉండడంతో.. నగర వాసులు ఆసక్తి కనబరుస్తున్నారు. చెరువులు, నాళాల కబ్జాపై ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను భాదితులు వెలికితీస్తున్నారు. రాజకీయ పలుకుబడితో కబ్జా చేస్తున్న వారిపైనే ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. మరి ఈరోజు ఎన్ని ఫిర్యాదులు వస్తాయో చూడాలి.

Exit mobile version