NTV Telugu Site icon

HYDRA : హైడ్రా కమిషనర్ చెరువుల పరిశీలన.. అభివృద్ధి పనులపై ఆదేశాలు

Hydra Commissioner Av Ranganath

Hydra Commissioner Av Ranganath

HYDRA : హైదరాబాద్ నగరంలోని చెరువుల సంరక్షణ, అభివృద్ధికి హైడ్రా (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ) ప్రత్యేక చర్యలు చేపడుతోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల పలు చెరువులను పరిశీలించి, అభివృద్ధి పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఖాజాగూడాలోని కొత్త కుంట చెరువులో ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) పరిధిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హైడ్రాకు ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వంశీరామ్ బిల్డర్స్ ప్రతినిధులతో మాట్లాడి చెరువులో వేసిన మట్టిని నాలుగు రోజుల్లో తొలగించాలని ఆదేశించారు. చెరువు ఎఫ్‌టీఎల్ పరిమితిని ఖచ్చితంగా తెలుసుకునేందుకు రెవెన్యూ, ఇరిగేషన్, హైడ్రా శాఖల జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

Boat Storm Infinity: 15 రోజుల బ్యాటరీ లైఫ్ తో.. బోట్ కొత్త స్మార్ట్ వాచ్ విడుదల.. తక్కువ ధరకే

హైడ్రా చేపట్టిన చెరువుల అభివృద్ధి పనులను కమిషనర్ రంగనాథ్ ప్రత్యక్షంగా పరిశీలించారు. మాదాపూర్‌లోని తమ్మిడికుంట, బొరబండ సమీపంలోని సున్నం చెరువును కమిషనర్ సందర్శించారు. ఈ రెండు చెరువుల్లో పూడికతీత పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. చెరువుల చుట్టూ తిరిగి సుందరీకరణ, పచ్చదనం పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించారు. హైడ్రా ఆధ్వర్యంలో 6 ప్రధాన చెరువుల పునరుద్ధరణ, అభివృద్ధి, సుందరీకరణ పనులను వచ్చే వర్షాకాలానికి ముందుగా పూర్తి చేయాలని కమిషనర్ రంగనాథ్ అధికారులకు ఆదేశించారు. చెరువుల పరిరక్షణ, అభివృద్ధి కోసం హైడ్రా చేపడుతున్న చర్యలు హైదరాబాద్ నగరంలోని నీటి వనరుల సంరక్షణలో కీలక పాత్ర పోషించనున్నాయి.

CM Yogi Adityanath: ఎన్నికల్లో కాంగ్రెస్ ‘‘జార్జ్ సోరోస్’’ డబ్బు వినియోగించింది..