NTV Telugu Site icon

HYDRA: చెరువుల పున‌రుజ్జీవ‌నంపై హైడ్రా ఫోకస్..

Hydra

Hydra

న‌గ‌ర ప‌రిధిలోని చెరువ‌ల ఆక్రమ‌ణ‌ల‌ను తొల‌గించిన హైడ్రా ఇప్పుడు.. ఆయా చెరువుల పున‌రుజ్జీవ‌నంపై దృష్టి సారించింది. నిజాంపేట మున్సిపాలిటీ ప‌రిధిలోని ప్రగ‌తీన‌గ‌ర్‌కు చేరువ‌లో ఉన్న ఎర్రకుంట చెరువుతో ఈ కార్యక్రమానికి శ్రీ‌కారం చుట్టారు అధికారులు. ఈ చెరువులో 5 అంత‌స్తుల 3 భ‌వ‌నాల‌ను ఆగ‌స్టు 14న హైడ్రా కూల్చివేత‌లు జ‌రిపిన విష‌యం తెలిసిందే. కూల్చివేతలు అనంత‌రం నిర్మాణానికి వాడిన ఐర‌న్‌తో పాటు, ఉప‌యోగ‌ప‌డే ఇత‌ర సామ‌గ్రిని నిర్మాణదారుడు తీసుకొని వెళ్ళగా.. మిగతా వ్యర్థాల‌ను తొల‌గించ‌కపోవటంతో, నిర్మాణ‌దారుడికి హైడ్రా నోటీసులు జారీ చేసింది.

Read Also: UP: ఒకే మైనర్‌ బాలుడిని ప్రేమించిన ఇద్దరు బాలికలు.. ముగ్గురూ కలిసి ఏం ప్లాన్ చేశారో చూడండి

ఎర్రకుంట‌లో గుట్టలుగా ప‌డి ఉన్న నిర్మాణ వ్యర్థాల‌ను పూర్తిగా తొల‌గించే ప‌నులను హైడ్రా అధికారులు ప్రారంభించారు. మ‌రో రెండు మూడు రోజుల్లో ప‌నులు పూర్తి చేయనున్నారు. నిర్మాణ వ్యర్థాల‌ను తరలించిన తరువాత హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆదేశాల మేర‌కు చెరువుకు పున‌రుజ్జీవ‌నం క‌ల్పించేందుకు అధికారులు ప్రణాళిక‌లు రూపొందిస్తున్నారు. అలాగే.. నగరంలోని మిగతా చెరువుల్లో కూల్చివేసిన భవనాల వ్యర్థాలను కూడా త్వరలో తొలగిస్తామని అధికారులు పేర్కొన్నారు. అన్ని చెరువుల్లో పురుజ్జీవనం పనులు చేపట్టనున్నారు.

Read Also: Eatala Rajendar: హిందూ దేవాలయాలపై దాడుల విషయంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదు..