NTV Telugu Site icon

HYDRA : చీకట్లో కూడా ఆగని హైడ్రా కూల్చివేతలు..

Hydra

Hydra

అమీన్ పూర్‌లో చీకట్లో కూడా ఆగకుండా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కృష్ణారెడిపేటలో లైట్ల వెలుతురులో అక్రమ నిర్మాణాలను బాహుబలి మిషన్ కూల్చివేస్తోంది. అక్రమ నిర్మాణాన్ని ఆనుకుని ప్రక్కనే మరొక అపార్ట్మెంట్ ఉంది. అయితే.. ఆ అపార్ట్మెంట్ కు ఇబ్బంది కలుగకుండా కూల్చే ప్రయత్నం చేస్తున్నారు హైడ్రా అధికారులు.. పూర్తి నిర్మాణాలు కూల్చే వరకు హైడ్రా యాక్టివిటీ కొనసాగనున్నట్లు అధికారులు చెబుతున్నారు. పటేల్ గుడా లో చివరి దశ కు హైడ్రా కూల్చివేతలు చేరుకున్నాయి. పటేల్ నగర్ లో 16 నిర్మాణాలు నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు.. సుమారు 12 గంటలుగా అమీన్ పూర్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి.

Minister Nadendla Manohar: ఎన్నికల హామీలన్నీ కచ్చితంగా నెరవేరుస్తాం..

అయితే.. కిష్టారెడ్డిపేట లో ఒక ఎకరం ప్రభుత్వం స్థలం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పటేల్ గూడలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన నిర్మాణాల తొలగించినట్లు, సర్వే నెం. 12/2, 12/3 లోని 25 నిర్మాణాల కూల్చివేసిన్టలు ప్రకటనలో తెలిపారు. పటేల్ గూడలో 3 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నట్లు, మూడు ప్రాంతాల్లో దాదాపు 8 ఎకరాలు ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. రెవెన్యూ, నీటిపారుదల, టౌన్ ప్లానింగ్ తో కలిసి కూల్చివేతలు జరిగినట్లు, నీటి వనరుల సంరక్షణ కోసం సంయుక్తంగా కృషి చేస్తున్నామన్నారు. నివాసం కోసం నిర్మించుకున్న భవనాలను కూల్చివేయలేదని, వ్యాపారం కోసం నిర్మించిన వాటిని మాత్రమే తొలగించామని ప్రకటనలో తెలిపారు.

Manish Sisodia: కొడుకు కాలేజీ ఫీజుల కోసం అడుక్కున్న: మనీష్ సిసోడియా