NTV Telugu Site icon

Hydra: శంషాబాద్ మున్సిపాలిటీలో అక్రమ హోర్డింగులపై హైడ్రా కూల్చివేతలు

Hydra

Hydra

Hydra: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీలో హైడ్రా అధికారులు నేడు (శుక్రవారం) అక్రమ హోర్డింగులపై దూకుడు పెంచారు. గత కొన్ని రోజులుగా శంషాబాద్ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు, ప్రత్యేకంగా అక్రమ హోర్డింగులు పెరిగినట్లు గుర్తించడంతో, హైడ్రా అధికారులు సమగ్ర తనిఖీలు చేపట్టారు. శంషాబాద్ మున్సిపాలిటీలో దాదాపు 200 కి పైగా అక్రమ హోర్డింగులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు శుక్రవారం చర్యలు ప్రారంభించారు. ప్రత్యేకంగా హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి పక్కన ఉన్న భారీ హోర్డింగులను కూల్చేందుకు భారీ పోలీసు బందోబస్తుతో చర్యలు చేపట్టారు.

Also Read: Minister Sandhya Rani: వైఎస్ జగన్పై తీవ్రంగా విరుచుకుపడ్డ మంత్రి సంధ్యారాణి

ఈ సందర్భంగా చుట్టుపక్కల ఉన్న షాపులను ఖాళీ చేయించి, అక్రమ హోర్డింగులను తొలగించడం జరిగింది. ఈ హోర్డింగులకు అనుమతులు ఇచ్చిన అధికారుల వివరాలు సేకరించారు హైడ్రా అధికారులు. ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రకటించారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం నుండి ట్యాక్స్‌లు చెల్లించకుండా అక్రమంగా హోర్డింగుల ద్వారా ఆదాయం పొందిన వారికి ఈ చర్యలు తీసుకోనున్నారు. ఈ కార్యక్రమంలో హైడ్రా అధికారులు, శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు, టౌన్ ప్లానింగ్ అధికారి మనోహర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా అక్రమ హోర్డింగులను తొలగించే ప్రక్రియను విడతల వారీగా కొనసాగిస్తామని హైడ్రా అధికారులు తెలిపారు.