Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Hydra Demolishes Illegal Construction In Ayyappa Society

HYDRA : అక్రమ నిర్మాణం కూల్చివేత‌.. 5 అంత‌స్తుల భ‌వ‌నం నేల మ‌ట్టం..

Published Date :January 5, 2025 , 10:58 pm
By Gogikar Sai Krishna
  • అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణం కూల్చివేత‌పై హైడ్రా ప్రకటన
  • స్థానిక పోలీసులతో పాటు పాల్గొన్న హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది
  • స్థానికుల ఫిర్యాదు మేర‌కు కూల్చివేత‌లు చేప‌ట్టిన హైడ్రా..
HYDRA : అక్రమ నిర్మాణం కూల్చివేత‌.. 5 అంత‌స్తుల భ‌వ‌నం నేల మ‌ట్టం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

HYDRA : అయ్యప్ప సొసైటీలో అక్ర‌మ నిర్మాణం కూల్చివేత‌ చేపట్టి 5 అంత‌స్తుల భ‌వ‌నం నేల మ‌ట్టం చేసింది. అయితే దీనిపై హైడ్రా ప్రకటన విడుదల చేసింది. శేరిలింగంప‌ల్లి మండ‌లం ఖానామెట్ విలేజీలోని అయ్య‌ప్ప‌ సొసైటీ స‌ర్వే నంబ‌రు 11/5 లో ప్లాట్ నంబ‌రు 5/13 పేరిట 684 గ‌జాల‌లో అక్ర‌మంగా నిర్మించిన‌ భ‌వ‌నాన్ని కూల్చివేసింది హైడ్రా.. ఈ కూల్చివేతలో స్థానిక పోలీసులతో పాటు హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. జీహెచ్ ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్త‌ర్వుల‌ను ప‌ట్టించుకోకుండా.. సెల్లార్‌, గ్రౌండ్‌ఫ్లోర్‌తో పాటు 5 అంత‌స్తుల భ‌వ‌నాన్ని నిర్మించ‌డంపై స్థానికుల ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదు మేర‌కు హైడ్రా కూల్చివేత‌లు చేప‌ట్టింది. రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారుల‌తో క‌ల‌సి అయ్య‌ప్ప సొసైటీలోని వంద ఫీట్ల రోడ్డుకు ఆనుకుని ఉన్న క‌ట్ట‌డాన్ని ముందుగానే పరిశీలించించారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌..

100 అడుగుల విస్తీర్ణంలో ముందు ఉన్న ర‌హ‌దారికి ఆనుకుని ఎలాంటి సెట్ బ్యాక్‌లు వ‌ద‌ల‌కుండా.. త‌గిన పార్కింగ్ సౌక‌ర్యం, ఫైర్ సేఫ్టీ జాగ్ర‌త్త‌లు తీసుకోకుండా చేపట్టిన భవన నిర్మాణం చేపట్టారు. సెల్లార్‌లోనే కిచెన్ ఉండేలా నిర్మించిన‌ట్టు గుర్తించారు హైడ్రా అధికారులు.. ఈ అక్ర‌మ భ‌వ‌న నిర్మాణాన్ని కూల్చివేస్తున్న‌ట్టు గత సంవత్సరం ఫిబ్రవరి 14న షోకాజ్ నోటీసులు జీహెచ్ ఎంసీ జారీ చేసింది.. అలాగే 26.2.24న స్పీకింగ్ ఆర్డ‌ర్ కూడా ఇచ్చింది… హైకోర్టు కూడా రిట్ పిటిష‌న్ నంబ‌రు 10030 ఆఫ్ 2024 పై స్పందిస్తూ అక్ర‌మ నిర్మాణ‌మ‌ని నిర్ధారించ‌డ‌మే కాకుండా కూల్చివేత‌ల‌కు సంబంధించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని 19.4.24 తేదీన ఆదేశించింది.. హైకోర్టు ఆర్డ‌ర్ ను ఆధారంగా తీసుకుని 13.06.2024 త‌ర్వాత కొంత భాగాన్ని కూల్చివేసింది..

ఇవేవీ ప‌ట్టించుకోకుండా నిర్మాణాన్ని కొన‌సాగించారంటూ క‌మిష‌న‌ర్ దృష్టికి తీసుకొచ్చారు స్థానిక అధికారులు.. కూల్చివేత‌కు సంబంధించి షోకాజ్ నోటీసుతో పాటు హైకోర్టు ఆర్డ‌ర్ ఇచ్చినా ప‌ట్టించుకోకుండా భ‌వ‌నాన్ని నిర్మించ‌డాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించారు హైడ్రా కమిషనర్.. అక్క‌డిక‌క్క‌డే కూల్చివేత‌ల‌కు సంబంధించి జీహెచ్ ఎంసీ చందాన‌గ‌ర్ స‌ర్కిల్ అధికారులు 14.2.24న ఇచ్చిన షోకాజ్ నోటీసుల‌తో పాటు హైకోర్టు ఉత్తర్వుల‌ను పరిశీలించారు హైడ్రా కమిషనర్.. అన్నీ ప‌రిశీలించి కూల్చివేత‌ల‌కు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ ఆదేశించడంతో కూల్చివేతలు చేపట్టారు అధికారులు..

అయ్యప్ప సొసైటీలో దాదాపు అన్ని కట్టడాలు అక్రమమేనన్న హైడ్రా కమిషనర్.. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన కట్టడాలను హైడ్రా మొదటగా కూల్చివేత ప్రారంభించనుందని తెలిపారు. ఆదివారం కూల్చేసిన భ‌వ‌న నిర్మాణ అనుమ‌తులు ఇచ్చిన అధికారులపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా హైడ్రా నివేదిక త‌యారు చేస్తోంది.. అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాల్లో అనేక హాస్టళ్లు నిర్మాణంలో ఉన్నాయి.. వందల మంది విద్యార్థులు, ఉద్యోగులు ఈ అక్రమ కట్టడాల్లో నివసిస్తున్నారు.. ఆయా భ‌వ‌నాల‌కు ఫైర్ సేఫ్టీ, నిర్మాణ అనుమతులు లేవు అనేది స్ప‌ష్టం.. అక్ర‌మ నిర్మాణాల‌తో మురుగు నీటి వ్య‌వ‌స్థ కూడా బాగా దెబ్బ‌తింది.. దీంతో ఆ ప‌రిస‌రాలు మురుగు మ‌యంగా మారి ర‌హ‌దారుల్లో మురుగు నీరు పారుతున్న దృశ్యాలు క‌నిపించాయి. ఇది మౌలిక సదుపాయాలపై (డ్రెయినేజ్ పైపులపై) అధిక భారం వల్ల జరుగుతోంది. అయ్య‌ప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు GHMC కమిషనర్‌ తో సమీక్ష నిర్వహించి సమన్వయంతో చర్యలు తీసుకుంటాం’ అని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ తెలిపారు.

Bombay High Court: ఒక్కసారి మాత్రమే అమ్మాయిని ఫాలో అవ్వడం వేధించడం కాదు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AV Ranganath
  • Ayyappa Society
  • Building Demolition
  • Chandanagar Circle
  • Drainage Problems

తాజావార్తలు

  • Petrol Price Hike: పెట్రోల్‌, డీజిల్‌పై రూ.55 పెంపు.. అక్కడ రూ.321కి చేరిన లీటర్‌ పెట్రోల్‌ ధర..

  • Deepika Padukone : మౌనం వీడిన దీపికా.. భర్త రణవీర్ తో కలిసి సందడి

  • Putin praises Iran: ఉద్రిక్తతల మధ్య పుతిన్ ఇరాన్‌కు సాలిడ్ సపోర్ట్.. రష్యా నమ్మకమైన స్నేహితుడు అంటూ సందేశం

  • CAPF Bill: ఢిల్లీలో నేతలు బిజిబిజీ.. నేడు రాజ్యసభలో “కేంద్ర సాయుధ పోలీసు బలగాలు” (CAPF) బిల్లు..!

  • MS Dhoni IPL Retirement: ఇదే చివరి సీజనా..? ఐపీఎల్‌ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన ధోనీ.. వీడియో వైరల్..

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions