NTV Telugu Site icon

AV Ranganath : కూల్చివేతలపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ కీలక ప్రకటన

Hydra

Hydra

కూల్చివేతలపై హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ కీలక ప్రకటన చేశారు. భ‌వ‌న నిర్మాణ వ్యర్థాలు తొల‌గించ‌ని వారిపై చ‌ర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. న‌గ‌రంలో చెరువుల‌ను, కాలువ‌ల‌ను, ఫుట్‌పాత్‌ల‌ను, ప్ర‌భుత్వ స్థలాల‌ను కాపాడుతూ.. న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు మెరుగైన జీవ‌నాన్ని ఇచ్చేందుకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన హైడ్రాకు నేటితో వంద‌రోజులు పూర్తి చేసుకుందని ఆయన తెలిపారు. ప్ర‌భుత్వ ల‌క్ష్యం మేర‌కు ముందుకు సాగుతూ.. చెరువుల‌కు పున‌రుజ్జీవ‌నం ఇచ్చేందుకు హైడ్రా చేస్తున్న ప్ర‌య‌త్నంలో మీడియా అందిస్తున్న స‌హ‌కారానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు ఏవీ రంగనాథ్‌. కొన్ని మీడియా సంస్థ‌లు, మ‌రికొంత‌ మంది సోష‌ల్‌ మీడియా ప‌నిక‌ట్ట‌కుని హైడ్రాపై త‌ప్పుడు ప్ర‌చారం చేసి.. ప్ర‌భుత్వ లక్ష్యాన్ని నీరుగార్చే ప్ర‌య‌త్నంచేస్తోందని ఆయన అన్నారు. ఈ నేప‌థ్యంలో హైడ్రా చ‌ర్య‌ల‌పై క్లారిటీ ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ అనుమ‌తులున్న భ‌వ‌నాల‌ను హైడ్రా కూల్చ‌దని, స‌ర్వే నంబ‌ర్లు మార్చేసి.. త‌ప్ప‌డు స‌మాచారంతో అనుమ‌తులు పొంది.. భూములు, చెరువుల‌ను ఆక్ర‌మించి చేప‌ట్టిన‌ నిర్మాణాలపై హైడ్రా చ‌ర్య‌లు తీసుకుంటుందని ఆయన తెలిపారు.

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ హౌసుకు క్యూ కట్టిన సెలబ్రిటీలు.. ఎవరెవరు వెళ్లారంటే?

అంతేకాకుండా..’హైడ్రా కూల్చిన త‌ర్వాత ఆ వ్య‌ర్థాల‌ను స‌ద‌రు బిల్డ‌రే తొల‌గించాలి.. లేని ప‌క్షంలో వారిపై హైడ్రా చ‌ర్య‌లు తీసుకుంటుంది.. ఇప్ప‌టికే ప‌లువురికి నోటీసులు కూడా ఇచ్చింది.. కొంత‌మంది నిర్మాణ వ్య‌ర్థాల‌ను తొల‌గిస్తుండ‌గా.. మ‌రి కొంద‌రు అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శిస్తున్నారు.. మ‌రి కొంత‌మంది అక్క‌డ ఉన్న విలువైన ఇనుప చువ్వ‌లు, ఇత‌ర సామ‌గ్రిని తీసుకుని వ్య‌ర్థాల‌ను వ‌దిలేస్తున్నారు.. అక్క‌డ పూర్వ స్థితికి భూమిని తీసుకురావాల్సిన బాధ్య‌త బిల్డ‌ర్ల‌పైనే ఉంది.. విలువైన వ‌స్తువులు తీసుకెళ్లి మిగ‌తా వ్య‌ర్థాల‌ను అక్క‌డే వ‌దిలేయ‌డాన్ని హైడ్రా తీవ్రంగా ప‌రిగ‌ణిస్తోంది.. చెరువుల‌కు పున‌రుజ్జీవ‌నం క‌ల్పించే క్ర‌మంలో హైడ్రానే చొర‌వ‌చూపి.. అక్క‌డ నిర్మాణ వ్య‌ర్థాల‌ను తొల‌గిస్తోంది.. ఇందుకు అయ్యే ఖ‌ర్చును నిర్మాణ‌దారుడి నుంచి వ‌సూలు చేస్తుంది.. నిర్మాణ వ్య‌ర్థాల తొల‌గింపు ప్రక్రియ‌ను కూడా టెండ‌ర్ల ద్వారా పిలిచి అప్ప‌గించ‌డ‌మౌతోంది.. ఇంకా మిగిలిపోయిన ఇనుప చువ్వ‌ల‌ను వేరుచేసి.. వ్య‌ర్థాల‌ను తొల‌గిస్తున్నారు.. వాస్త‌వాలు ఇలా ఉంటే.. కొన్ని మీడియా సంస్థ‌లు హైడ్రా చ‌ర్య‌ల‌ ప‌ట్ల ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాయి.. వాస్త‌వాలు తెలుసుకోకుండా.. ప్ర‌చారం చేస్తున్నాయి.. ఉదాహ‌ర‌ణ‌కు నిజాంపేట మున్సిప‌ల్ ప‌రిధిలోని ఎర్ర‌కుంట చెరువులో స‌ర్వే నంబ‌ర్లు వేరేవి చూపించి.. త‌ప్ప‌డు స‌మాచారంతో ఎర్ర‌కుంట చెరువులోని ఎఫ్‌టీఎల్ ప‌రిధిలోని స‌ర్వే నంబ‌ర్లు 48, 49లో నిర్మించిన 5 అంత‌స్తుల 3 భ‌వ‌నాల‌ను ఆగ‌స్టు 14వ తేదీన హైడ్రా కూల్చిన విష‌యం విధిత‌మే..

ఎర్ర‌కుంట ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో 5 అంత‌స్తుల 3 భ‌వ‌నాల‌ను నిర్మించిన సుధాక‌ర్‌రెడ్డి పై ఇరిగేష‌న్ విభాగం అధికారులు బాచుప‌ల్లి పోలీసు స్టేష‌న్లో కేసు కూడా పెట్టారు.. ఎర్ర‌కుంట చెరువులో నిర్మించిన భ‌వ‌నాల వ్య‌ర్థాల‌ను తొల‌గించాల‌ని స‌ద‌రు నిర్మాణ‌దారుడు సుధాక‌ర్ రెడ్డికి నోటీసులు కూడా హైడ్రా జారీ చేసింది.. అయితే విలువైన వ‌స్తువుల‌ను తీసుకెళ్లి.. భ‌వ‌న వ్య‌ర్థాల‌ను అక్క‌డే స‌ద‌రు నిర్మాణ‌దారుడు వ‌దిలేశారు.. ఎర్ర‌కుంట చెరువుకు పున‌రుజ్జీవ‌నం ఇచ్చే క్ర‌మంలో.. అక్క‌డ‌ వ‌దిలేసిన వ్య‌ర్థాల‌ను తొల‌గించే ప‌నికి హైడ్రా టెండ‌ర్లు పిలిచింది.. పిల్ల‌ర్ల మ‌ధ్య‌న ఉన్న ఇనుప చువ్వ‌ల‌ను తొల‌గించి.. వాటిని అమ్మ‌గా వ‌చ్చిన డ‌బ్బును మిన‌హాయించి.. డెబ్రీస్‌ను ఎత్త‌డానికి ఎంత అయ్యిందో అంత చెల్లించాల‌ని హైడ్రా నిర్ణ‌యించింది.. ఇదే మొత్తాన్ని భ‌వ‌న నిర్మాణ‌దారుడిని నుంచి వ‌సూలు చేస్తుంది.. న‌గ‌రంలో ట్రాఫిక్, వ‌ర‌ద నీటి స‌మ‌స్య ప‌రిష్కారానికి హైడ్రా కృషి చేస్తోంది.. ఈ క్ర‌మంలో వ‌ర‌ద ముప్పు ఉన్న ప్రాంతాల్లో చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌పై క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించి చ‌ర్య‌లు తీసుకుంటోంది..’ అని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తెలిపారు.

KA Movie: దీపావళికి ఒక్క తెలుగులోనే ‘క’ రిలీజ్.. ఎందుకంటే?