Site icon NTV Telugu

HYDRA Commissioner Ranganath: హైడ్రా అంటే ఒక భరోసా.. హైడ్రాను భూచి, రాక్షసిగా చూపించొద్దు..

Hydra

Hydra

HYDRA Commissioner Ranganath: ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. చెరువులు, నాలాలు కాపాడడమే హైడ్రా లక్ష్యమని వెల్లడించారు. ఆర్టికల్ 21 ప్రకారం.. పరిశుభ్రమైన వాతావరణం రైట్ టూ లైఫ్ ఉద్దేశమన్నారు. హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎసెట్ ప్రొటెస్ట్ ఉద్దేశ్యం.. వాటి పరిరక్షణ మా బాధ్యత అని పేర్కొన్నారు. నదులు, చెరువులు, నాలాలు ప్రజల ఆస్తులేనన్నారు. సోషల్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన తెలిపారు. అమీన్‌పూర్‌లో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయన్నారు. అమీన్‌పూర్‌లో ఓ భవనాన్ని కూల్చినా మళ్లీ కట్టారని రంగనాథ్ తెలిపారు. భవనంలో ఆస్పత్రి లేకపోయినా ఆస్పత్రి ఉన్నట్లు ప్రచారం చేశారన్నారు. కొందరు బలవంతులు అక్రమ కట్టడాల వెనుక ఉన్నారన్నారు. అనధికార ఆస్తులను కూల్చివేశామన్న ఆయన.. ఇప్పటి వరకు 21, 22 ప్రాంతాల్లో కూల్చివేతలు చేశామన్నారు. కొంతమంది దుండిగల్, అమీన్‌పూర్ ప్రాంతంలో నకిలీ పర్మిషన్లు ఇచ్చారు. అలా పర్మిషన్లు ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేశామని.. పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేశామన్నారు. ఎక్కడ హాస్పిటల్‌ను హైడ్రా కూల్చలేదన్నారు.

Read Also: Dana Kishore : గతంలో మూసీకి భారీగా వరదలు వచ్చాయి.. గతంలోనూ నిర్వాసితులను తరలించారు.

కొంతమంది ఆస్తులు కొనుగోలు చేసే ముందు సరైన విచారణ చేయకుండా కొనుగోలు చేస్తున్నారని.. పంచాయతీ పర్మిషన్లు క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా కొందరు నిర్మాణాలు చేపట్టారన్నారు. తప్పులు చేసిన బిల్డర్లపై క్రిమినల్ కేసులు పెడుతున్నామన్నారు.సున్నం చెరువులో వెంకటేష్ అనే వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకున్న వ్యక్తి ట్యాంకర్ల బిజినెస్ చేస్తాడని.. ఒకరోజు ఆదాయం లక్షకు పైనే ఉంటుందన్నారు. ఎఫ్టీఎల్‌లో ప్రజలు నివాసం ఉండే సముదాయాల జోలికి వెళ్లడం లేదన్నారు. కూల్చివేతలకు సంబంధించి సంబంధిత ఇంటి యజమానులకు సమాచారం ఇస్తున్నామన్నారు. బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకోవడం వెనుక వేరే కారణం ఉందన్నారు. హైడ్రా అంటే ఒక భరోసా… హైడ్రాను భూచి, రాక్షసిగా చూపించొద్దని రంగనాథ్ సూచించారు. దేశంలో ఎక్కడా హైడ్రా లాంటి వ్యవస్థ లేదన్నారు. హైడ్రాను భయంగా చూపొద్దు.. హైడ్రా అంటే బాధ్యత, భరోసా అని పేర్కొన్నారు. పర్మిషన్ ఉందని చెబుతోంది తప్పు.. ఒకవేళ పర్మిషన్ చూపినా అవన్నీ తప్పు.. వాటి సమయం ముగిసి ఎంతో కాలం అవుతుందన్నారు. చాలా కాలేజీలపై ఫిర్యాదులు వచ్చాయని.. అకడమిక్ ఇయర్ మధ్యలో ఉందని, విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత వాటిని చూస్తామన్నారు. 111 జీవో మా పరిధి కాదని వ్యాఖ్యానించారు. చిన్న వాళ్ల ఇండ్లు కూల్చుతున్నాం అంటున్నారు.. వాళ్ళ వెనుక పెద్ద వాళ్ళు ఉన్నారన్నారు.

 

Exit mobile version