HYDRA Commissioner Ranganath: హైడ్రా అంటే ఒక భరోసా.. హైడ్రాను భూచి, రాక్షసిగా చూపించొద్దు..
- చెరువులు..నాలాలు కాపాడడమే హైడ్రా లక్ష్యం
- సోషల్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది
- దేశంలో ఎక్కడా హైడ్రా లాంటి వ్యవస్థ లేదు
- హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYDRA Commissioner Ranganath: ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. చెరువులు, నాలాలు కాపాడడమే హైడ్రా లక్ష్యమని వెల్లడించారు. ఆర్టికల్ 21 ప్రకారం.. పరిశుభ్రమైన వాతావరణం రైట్ టూ లైఫ్ ఉద్దేశమన్నారు. హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎసెట్ ప్రొటెస్ట్ ఉద్దేశ్యం.. వాటి పరిరక్షణ మా బాధ్యత అని పేర్కొన్నారు. నదులు, చెరువులు, నాలాలు ప్రజల ఆస్తులేనన్నారు. సోషల్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన తెలిపారు. అమీన్పూర్లో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయన్నారు. అమీన్పూర్లో ఓ భవనాన్ని కూల్చినా మళ్లీ కట్టారని రంగనాథ్ తెలిపారు. భవనంలో ఆస్పత్రి లేకపోయినా ఆస్పత్రి ఉన్నట్లు ప్రచారం చేశారన్నారు. కొందరు బలవంతులు అక్రమ కట్టడాల వెనుక ఉన్నారన్నారు. అనధికార ఆస్తులను కూల్చివేశామన్న ఆయన.. ఇప్పటి వరకు 21, 22 ప్రాంతాల్లో కూల్చివేతలు చేశామన్నారు. కొంతమంది దుండిగల్, అమీన్పూర్ ప్రాంతంలో నకిలీ పర్మిషన్లు ఇచ్చారు. అలా పర్మిషన్లు ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేశామని.. పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేశామన్నారు. ఎక్కడ హాస్పిటల్‌ను హైడ్రా కూల్చలేదన్నారు.
Read Also: Dana Kishore : గతంలో మూసీకి భారీగా వరదలు వచ్చాయి.. గతంలోనూ నిర్వాసితులను తరలించారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
కొంతమంది ఆస్తులు కొనుగోలు చేసే ముందు సరైన విచారణ చేయకుండా కొనుగోలు చేస్తున్నారని.. పంచాయతీ పర్మిషన్లు క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా కొందరు నిర్మాణాలు చేపట్టారన్నారు. తప్పులు చేసిన బిల్డర్లపై క్రిమినల్ కేసులు పెడుతున్నామన్నారు.సున్నం చెరువులో వెంకటేష్ అనే వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకున్న వ్యక్తి ట్యాంకర్ల బిజినెస్ చేస్తాడని.. ఒకరోజు ఆదాయం లక్షకు పైనే ఉంటుందన్నారు. ఎఫ్టీఎల్లో ప్రజలు నివాసం ఉండే సముదాయాల జోలికి వెళ్లడం లేదన్నారు. కూల్చివేతలకు సంబంధించి సంబంధిత ఇంటి యజమానులకు సమాచారం ఇస్తున్నామన్నారు. బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకోవడం వెనుక వేరే కారణం ఉందన్నారు. హైడ్రా అంటే ఒక భరోసా… హైడ్రాను భూచి, రాక్షసిగా చూపించొద్దని రంగనాథ్ సూచించారు. దేశంలో ఎక్కడా హైడ్రా లాంటి వ్యవస్థ లేదన్నారు. హైడ్రాను భయంగా చూపొద్దు.. హైడ్రా అంటే బాధ్యత, భరోసా అని పేర్కొన్నారు. పర్మిషన్ ఉందని చెబుతోంది తప్పు.. ఒకవేళ పర్మిషన్ చూపినా అవన్నీ తప్పు.. వాటి సమయం ముగిసి ఎంతో కాలం అవుతుందన్నారు. చాలా కాలేజీలపై ఫిర్యాదులు వచ్చాయని.. అకడమిక్ ఇయర్ మధ్యలో ఉందని, విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత వాటిని చూస్తామన్నారు. 111 జీవో మా పరిధి కాదని వ్యాఖ్యానించారు. చిన్న వాళ్ల ఇండ్లు కూల్చుతున్నాం అంటున్నారు.. వాళ్ళ వెనుక పెద్ద వాళ్ళు ఉన్నారన్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..