AV Ranganath: కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా కమిషనర్ సుడిగాలి పర్యటన..
- కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా కమిషనర్ సుడిగాలి పర్యటన
- 15 చెరువుల ఆక్రమణ పై ఫిర్యాదులు రావడంతో అక్కడికి వెళ్లిన ఏవి రంగనాథ్
- మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సాయంత్రం వేళ పర్యటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సుడిగాలి పర్యటన చేశారు. నగరశివారులోని 15 చెరువుల ఆక్రమణ పై ఫిర్యాదులు రావడంతో హైడ్రా కమిషనర్ అక్కడికి వెళ్లారు. మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సాయంత్రం వేళ పర్యటించారు. ఫాక్స్ సాగర్, దూలపల్లి అశోక్ విల్లాస్ దగ్గర నాలా కబ్జాను, పలు చెరువులను ఆయన పరిశీలించారు. చెరువుల కబ్జాలపై స్థానికుల ఫిర్యాదుతో మంచి స్పందన వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఈ క్రమంలో.. హైడ్రా కమిషనర్ రంగనాథ్, కొంపల్లి మునిసిపల్ కమీషనర్.. ఇరిగేషన్ డి.ఓ, రెవెన్యూ అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Read Also: Top Headlines @ 9PM: టాప్ న్యూస్
Also Read
మరోవైపు.. హైదరాబాద్ మహానగరంలో చెరువులు, కుంటల ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదులు ఎక్కవవుతున్నాయి. బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయానికి ఫిర్యాదు దారులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు భారీగా క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో.. హైడ్రా కార్యాలయానికి రోజు రోజుకీ తాకిడి పెరుగుతోంది. మొదట్లో తక్కువగా
వచ్చిన ఫిర్యాదులు.. హైడ్రా కఠిన చర్యలు తీసుకుంటుండటంతో వందల్లోకి చేరాయి. వాటన్నింటినీ స్వీకరిస్తున్న కార్యాలయ సిబ్బంది అందులోని వివరాలను నమోదు చేసుకుంటూ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తున్నారు. మరోవైపు ఫిర్యాదుదారుల తాకిడి పెరగడంతో హైడ్రా కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు పెంచారు. అంతేకాకుండా.. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు ప్రభుత్వం భద్రత పెంచింది. రంగనాథ్ ఇంటి దగ్గర పోలీసులు భద్రత పెంచారు. మధురానగర్ కాలనీ డీ-81లోని ఆయన ఇంటి వద్ద ఇద్దరు సెక్యూరిటీతో కూడిన ఔట్ పోస్టు కూడా ఏర్పాటు చేశారు.
Read Also: Hyderabad: రేపు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ..
తాజావార్తలు
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!