WTC FINAL 2023: ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్న హైదరబాదీ ఫాస్ట్ బౌలర్.. మెరుపు వేగంతో బౌలింగ్ చేస్తున్న సిరాజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WTC FINAL 2023: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్ లో హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ సిరాజ్ మియా.. ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. మ్యాచ్ ఆరంభంలోనే ఒక వికెట్ తీసి శుభారంభాన్ని అందించిన సిరాజ్.. ఆసీస్ బ్యాటర్లను హడలెత్తిస్తున్నాడు. ఓవల్ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ పోరు జరుగుతుండగా.. ముందుగా టాస్ గెలిచిన.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ను ఎంచుకున్నాడు. అంతకుముందు, ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాదంలో మృతులకు ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాండ్‌లతో నివాళులర్పించారు.
Read Also: Jeevandan Swarnalatha: దేశవ్యాప్తంగా అవయవదానంలో తెలంగాణ రాష్ట్రమే టాప్
Also Read
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
మొదటగా బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను పెవిలియన్ కు పంపించాడు మహమ్మద్ సిరాజ్. అయితే ఓవల్ పిచ్ లో పేసర్లకు అనుకూలిస్తుండటంతో కెప్టెన్ రోహిత్ శర్మ తన అస్త్రాన్ని వాడాడు. ఇంకేముంది భారత్ కు సిరాజ్ రూపంలో ఒక శుభారంభం దొరికింది. ఐపీఎల్ లోని తన ఫామ్ ను కంటిన్యూ చేస్తూ.. సిరాజ్ చెలరేగుతున్నాడు. ముందుగా ఒక వికెట్ తీసి ఫాంలో ఉన్న సిరాజ్.. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో మరోసారి చెలరేగాడు.
Read Also: Early Elections in Andhra Pradesh: ముందస్తు ఎన్నికలపై తేల్చేసిన సీఎం జగన్.. అప్పుడేనంటూ క్లారిటీ..
క్రీజులో ఉన్న మార్నస్ లబుషెన్ కు తొలి బంతిని 143 కి.మీ వేగంతో విసిరాడు సిరాజ్. అయితే, ఇది అదనపు బౌన్స్, ఔట్ సీమ్‌గా రావడంతో మార్సన్ లబూషెన్ బిత్తరబోయాడు. అంతేకాకుండా ఆ బాల్ వేగంగా చేతికి తాకడంతో బ్యాట్‌ను కిందపడేశాడు. వెంటనే గ్లౌజ్ తీసి చూసుకోగా.. అతని ఎడమ చేతి బొటన వేలికి దెబ్బ తగిలింది. వెంటనే మైదానంలోకి ఫిజియో వచ్చి చెక్ చేసి, ఆయింట్ మెంట్ రాశాడు. దీంతో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మార్నస్ బ్యాటింగ్ చేసేందుకు ఓకే చెప్పాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే సిరాజ్ మియా ఇలానే మెరుపు వేగంతో బంతులు వేస్తే.. ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేయవచ్చు. కమాన్ సిరాజ్ భాయ్.
When Labuschagne got hurt on his thumb, Shubman Gill shouted : Tod de ungli to Siraj 🤣😭#Siraj #INDvsAUS #WTCFinal pic.twitter.com/m5xnfwc0kG
— SPORTSBUZZINFO (@Sportsbuzinfo) June 7, 2023
తాజావార్తలు
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!