NTV Telugu Site icon

WTC FINAL 2023: ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్న హైదరబాదీ ఫాస్ట్ బౌలర్.. మెరుపు వేగంతో బౌలింగ్ చేస్తున్న సిరాజ్

Siraj

Siraj

WTC FINAL 2023: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్ లో హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ సిరాజ్ మియా.. ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. మ్యాచ్ ఆరంభంలోనే ఒక వికెట్ తీసి శుభారంభాన్ని అందించిన సిరాజ్.. ఆసీస్ బ్యాటర్లను హడలెత్తిస్తున్నాడు. ఓవల్ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ పోరు జరుగుతుండగా.. ముందుగా టాస్ గెలిచిన.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ను ఎంచుకున్నాడు. అంతకుముందు, ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాదంలో మృతులకు ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాండ్‌లతో నివాళులర్పించారు.

Read Also: Jeevandan Swarnalatha: దేశవ్యాప్తంగా అవయవదానంలో తెలంగాణ రాష్ట్రమే టాప్

మొదటగా బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను పెవిలియన్ కు పంపించాడు మహమ్మద్ సిరాజ్. అయితే ఓవల్ పిచ్ లో పేసర్లకు అనుకూలిస్తుండటంతో కెప్టెన్ రోహిత్ శర్మ తన అస్త్రాన్ని వాడాడు. ఇంకేముంది భారత్ కు సిరాజ్ రూపంలో ఒక శుభారంభం దొరికింది. ఐపీఎల్ లోని తన ఫామ్ ను కంటిన్యూ చేస్తూ.. సిరాజ్ చెలరేగుతున్నాడు. ముందుగా ఒక వికెట్ తీసి ఫాంలో ఉన్న సిరాజ్.. ఇన్నింగ్స్ 8వ ఓవర్లో మరోసారి చెలరేగాడు.

Read Also: Early Elections in Andhra Pradesh: ముందస్తు ఎన్నికలపై తేల్చేసిన సీఎం జగన్‌.. అప్పుడేనంటూ క్లారిటీ..

క్రీజులో ఉన్న మార్నస్ లబుషెన్ కు తొలి బంతిని 143 కి.మీ వేగంతో విసిరాడు సిరాజ్. అయితే, ఇది అదనపు బౌన్స్, ఔట్ సీమ్‌గా రావడంతో మార్సన్ లబూషెన్ బిత్తరబోయాడు. అంతేకాకుండా ఆ బాల్ వేగంగా చేతికి తాకడంతో బ్యాట్‌ను కిందపడేశాడు. వెంటనే గ్లౌజ్ తీసి చూసుకోగా.. అతని ఎడమ చేతి బొటన వేలికి దెబ్బ తగిలింది. వెంటనే మైదానంలోకి ఫిజియో వచ్చి చెక్ చేసి, ఆయింట్ మెంట్ రాశాడు. దీంతో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మార్నస్ బ్యాటింగ్‌ చేసేందుకు ఓకే చెప్పాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే సిరాజ్ మియా ఇలానే మెరుపు వేగంతో బంతులు వేస్తే.. ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేయవచ్చు. కమాన్ సిరాజ్ భాయ్.