Komali Suicide: ప్రేమ, వేదన, ఎదురు చూపులు.. కన్నీళ్లు పెట్టించే యూట్యూబర్ కోమలి సూసైడ్ నోట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మణికొండ చిత్రపురి కాలనీలో తన మామ ఇంట్లో ఉంటోంది. మల్లారెడ్డి యూనివర్సిటీలో BSC చదువుతు.. పార్ట్ టైమ్‌లో యూట్యూబ్ వీడియోలు చేస్తుంది. అయితే.. కోమలి అఖిల్ రెడ్డి అనే యువకుడిని ప్రేమించింది. పలు కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం అఖిల్ అండ్ ఫ్యామిలీ పరారీలో ఉంది. కోమలి ఆత్మహత్యకి ఒకరోజు ముందు కోమలి ఫ్లాట్ అఖిల్ వెళ్లి ఆ యువతితో మాట్లాడాడు. తనను ప్రేమించి.. మరో అమ్మాయితో ప్రేమలో ఉండటాన్ని కోమలి జీర్ణించుకోలేక పోయింది.. ఇద్దరు అమ్మాయిలతో ప్రేమాయణం నడిపించాడు అఖిల్.. ఆత్మహత్యకి ముందు అఖిల్‌కి కోమలి మెసేజ్ చేసింది. ఈ విషయాన్ని తన అక్కకు చెప్పాడు అఖిల్.. అఖిల్ అక్క కోమలి ఫ్లాట్‌కి వెళ్ళి డోర్ కొట్టింది. ఎంతసేపటికీ తీయకపోవడంతో తిరిగి వెళ్లిపోయింది కానీ.. పోలీసులకు సమాచారం ఇవ్వలేదు.
READ MORE: Claude AI Memes: “అబ్‌సల్యూట్ సినిమా”.. క్లాడ్ కొత్త ప్లగిన్స్‌తో ఏఐ అరాచకం! సోషల్ మీడియాలో తుఫాన్..
Also Read
- Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
- UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
- CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
ఇదిలా ఉండగా.. కోమలికి ఫ్లాట్‌లో సూసైడ్ లెటర్ లభ్యమైంది. దీన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. “నేను ముందుకు సాగడానికి భయపడుతున్నాను.. ఎందుకంటే అతను తిరిగి వస్తే? వదిలేయాలి అని నాకు తెలుసు. అతను నా వాడు కాదు అని తెలుసు.. అతను నాతో ఉండడానికి కూడా ప్రయత్నించడం లేదు అని తెలుసు.. కానీ నా లోపల చిన్న భాగం ఇంకా ఎదురు చూస్తోంది.. ఇంకా ఆశిస్తోంది.. ఒక రోజు అతను నన్నే ఎంచుకుంటాడని నా మనసు ఊహిస్తోంది. అందుకే ముందుకు సాగడం అసాధ్యంగా అనిపిస్తోంది.. ఎందుకంటే నేను చివరికి వెనక్కి తిరిగి నడిచి వెళ్లిన క్షణంలో.. అతను తిరిగి వచ్చి నన్ను వెతికితే..” అని సూసైడ్ లెటర్‌లో రాసుకొచ్చింది.
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!