NTV Telugu Site icon

Hyderabad Woman: యూఎస్‌లో ఆకలితో తెలంగాణ యువతి.. విదేశాంగ మంత్రికి లేఖ రాసిన తల్లి!

Hyderabad Woman

Hyderabad Woman

Hyderabad Woman: మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు అమెరికాకు వెళ్లిన హైదరాబాద్ మహిళ సయ్యదా లులు మిన్హాజ్ జైదీ చికాగో రోడ్లపై మానసిక ఒత్తిడితో పోరాడుతూ, తన వస్తువులు చోరీకి గురై ఆకలితో అలమటిస్తున్నారు. సయ్యదా తల్లి సయ్యదా వహాజ్ ఫాతిమా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు లేఖ రాస్తూ జోక్యం చేసుకుని తన కుమార్తెను భారత్‌కు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. భారత రాష్ట్ర సమితి నాయకుడు ఖలీకర్ రెహమాన్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసిన తర్వాత ఈ లేఖ సోషల్ మీడియాలో కనిపించింది.

Also Read: Black Tamota : బ్లాక్ టమోటా గురించి ఎప్పుడైనా విన్నారా?ఎన్ని లాభాలో..

లేఖలో సయ్యదా తల్లి తన కుమార్తె యొక్క కష్టాలను ఇలా వివరించింది. “తెలంగాణలోని మౌలాలీ నివాసి అయిన నా కుమార్తె సయ్యదా లులు మిన్హాజ్ జైదీ ఆగస్టు 2021లో డెట్రాయిట్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చదివేందుకు వెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత మాతో తరచుగా టచ్‌లో ఉండేది. కానీ, గత రెండు నెలలుగా ఆమె నాతో టచ్‌లో ఉండడం లేదని, నా కూతురు డిప్రెషన్‌లో ఉందని, ఆమె సామాన్లు ఎవరో దొంగిలించారని, దీంతో ఆమె ఆకలితో అలమటిస్తోందని ఇద్దరు హైదరాబాద్ యువకుల ద్వారా మాకు తెలిసింది. అమెరికాలోని చికాగో రోడ్లపై నా కూతురు కనిపించిందని చెప్పారు. దయచేసి కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జోక్యం చేసుకుని నా కూతురిని భారత్‌కు రప్పించాలి.” అని సయ్యదా తల్లి విజ్ఞప్తి చేసింది.

వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం, చికాగోలోని భారత కాన్సులేట్ జోక్యం చేసుకుని తన కుమార్తెను తిరిగి తీసుకురావాలని అభ్యర్థిస్తోంది. మహ్మద్ మిన్హాజ్ అఖ్తర్ సహాయంతో తన కుమార్తెను గుర్తించవచ్చని ఆమె పంచుకున్నారు.