Cyber Crime: వర్క్‌ఫ్రమ్ హోమ్ పేరుతో టోకరా.. హైదరాబాద్ మహిళ ఆత్మహత్య!
- వర్క్‌ఫ్రమ్ హోమ్ అంటూ సైబర్ మోసం
- బంగారం అమ్మి పెట్టుబడి పెట్టిన మహిళ
- మహిళను మోసం చేసిన సైబర్ నేరగాళ్లు
- మోసానికి కలత చెందిన ఆత్మహత్య చేసుకున్న మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ‘సైబర్ నేరగాళ్లు’ ఎప్పుడు ఎలాంటి మోసాలకు పాల్పడతారో ఎవరీ అర్ధం కావడం లేదు. మెసేజెస్, కాల్స్, బెదిరింపులు, లోన్స్, డిజిటల్ అరెస్టు.. ఇలా అనేక రూపాల్లో జనాలను మోసం చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది సైబర్ నేరగాళ్ల మోసానికి బలయ్యారు. జనాలు ఎంత అప్రమత్తంగా ఉన్నా.. సైబర్ నేరగాళ్లు పన్నిన వలలో మాత్రం చిక్కకుండా ఉండలేకపోతున్నారు. తాజాగా వర్క్‌ఫ్రమ్ హోమ్ అంటూ ఓ మహిళను సైబర్ నేరస్తులు మోసం చేశారు. మోసానికి కలత చెందిన ఆ మహిళ చివరకు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని చోటుచేసుకుంది.
ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా కంచుస్తంభంపాలెం వాసి అనూషకు దగ్గరి బంధువైన వెంకన్న బాబుతో ఐదేళ్ల కిందట వివాహం అయింది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని తులసీనగర్‌లో నివాసం ఉంటున్నారు. అనూష టెలిగ్రామ్ యాప్‌లో వర్క్‌ఫ్రమ్ హోమ్ అంటూ ప్రకటన చూసి ఫాలో అయింది. సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి ముందు రూ.1000 కట్టింది. దీంతో ఆమెకు రూ.7 వేలు వచ్చినట్టు యాప్‌లో చూపెట్టింది. యాప్‌లో డబ్బులు కనిపిస్తున్నా.. బ్యాంకు ఖాతాలోకి మాత్రం బదిలీ అవలేదు. బ్యాంకు ఖాతాలోకి డబ్బులు బదిలీ అవ్వాలంటే.. ఇంకా కొంత డబ్బులు పెట్టుబడి పెట్టాలని చెప్పారు. సైబర్ నేరగాళ్లు చెప్పిన మాటలకు ఆకర్షితురాలైన అనూష.. తన దగ్గర ఉన్న బంగారం అమ్మి పెట్టుబడి పెట్టింది.
Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
Also Read: IND vs ENG 3rd Test: లార్డ్స్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్.. టీమిండియా పేస్ గుర్రం వచ్చేశాడు!
సుమారు లక్ష రూపాయల వరకు అనూష పెట్టుబడులు పెట్టింది. పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయని భావించింది. అయితే సైబర్ నేరగాళ్లు స్పదించలేదు. చివరికి తాను సైబర్ నేరగాల మోసానికి బలి అయ్యానని గుర్తించింది. సైబర్ మోసానికి అనూష కలత చెందింది. గురువారం కుమారుడిని నిద్రపుచ్చి.. అనూష ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. ఆత్మహత్యకు ముందు అనూష లేఖ రాసింది. తన మాదిరి టెలిగ్రామ్ యాప్ వలలో పడి మోసపోవద్దని, బాబు జాగ్రత్త అంటూ లేఖ రాసింది. టెలిగ్రామ్ యాప్ మొత్తం మోసాల పుట్టని పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!