Farzi Season 2 Update: మూడేళ్ల నిరీక్షణ తర్వాత ‘ఫర్జీ 2’.. స్ట్రీమింగ్ డేట్‌పై క్లారిటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farzi Season 2 Update: షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ఫర్జీ’. 2023లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ సిరీస్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచే సీజన్ 2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ నిరీక్షణకు ముగింపు పలికేలా కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వంటి బ్లాక్‌బస్టర్ వెబ్ సిరీస్‌లతో గుర్తింపు పొందిన దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ‘ఫర్జీ’ తొలి సీజన్లో షాహిద్ కపూర్ ఓ ప్రతిభావంతమైన ఆర్టిస్ట్‌గా కనిపిస్తాడు. పరిస్థితుల కారణంగా నకిలీ కరెన్సీ ముద్రించే ప్రపంచంలోకి అడుగుపెట్టిన అతని ప్రయాణం ఊహించని మలుపులు తీసుకుంటుంది. మరోవైపు క్రైమ్ బ్రాంచ్ అధికారిగా విజయ్ సేతుపతి తన నటనతో సిరీస్ ను మరో లెవెల్ కి తీసుకెళ్లారు. వీరిద్దరి మధ్య సాగే మైండ్ గేమ్స్ తో సిరీస్ ఇంటెన్స్ గా సాగుతూ ఆడియన్స్ కి కావాల్సినంత థ్రిల్ ను ఇచ్చింది.
2026 ఫిబ్రవరి 10న రాజ్ అండ్ డీకే సోషల్ మీడియాలో ‘రౌండ్ 2 ఇన్ ప్రోగ్రెస్’ అంటూ అధికారికంగా ‘ఫర్జీ సీజన్ 2’ను ప్రకటించారు. అనంతరం మార్చి 2026లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి పాల్గొనే షూటింగ్ కూడా ప్రారంభమైంది. తొలి సీజన్ కంటే మరింత భారీ స్థాయిలో, ఎక్కువ థ్రిల్‌తో ఈ కొత్త సీజన్‌ను రూపొందిస్తున్నట్లు చిత్రబృందం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. ప్రస్తుత సమాచారం ప్రకారం ‘ఫర్జీ సీజన్ 2’ ఈ ఏడాది చివరిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ నిర్మాణ పనులు కొద్దిగా ఆలస్యమైతే 2027 ప్రారంభంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు వచ్చే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే అధికారిక విడుదల తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు.
Also Read
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
- Ramayana : 'రామాయణ' ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
ఇదిలా ఉండగా విజయ్ సేతుపతి ప్రమోట్ చేసిన తమిళ వెబ్ సిరీస్ ‘సుజల్: ది వోర్టెక్స్’ రెండో సీజన్ ఇప్పటికే 2025 ఫిబ్రవరి 28న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై మంచి ఆదరణ పొందింది. మరోవైపు జియోహాట్‌స్టార్‌లో విడుదలైన ‘ముత్తు ఎంగిర కాట్టాన్’ తొలి సీజన్ కూడా మంచి స్పందన దక్కించుకుంది. క్లైమాక్స్‌ను బట్టి రెండో సీజన్ వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ, దీనిపై మేకర్స్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం విజయ్ సేతుపతి ‘ఫర్జీ 2’తో పాటు సినిమాల్లో బిజీగా ఉండటంతో, ‘ముత్తు ఎంగిర కాట్టాన్ సీజన్ 2’ 2027 మధ్యలో లేదా చివర్లో వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
ట్రెండింగ్
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?