Hyderabad: పెళ్లి పేరుతో నమ్మించి తెచ్చి నరకం చూపించాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్‌లో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. మయన్మార్‌కు చెందిన 18 ఏళ్ల వివాహితను ఆమె భర్తే ఇంట్లో బంధించి, తన ముగ్గురు స్నేహితులతో వరుసగా అత్యాచారానికి ఒడిగట్టించిన సంఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. అక్టోబర్ 23న ఇంటి యజమాని బకాయి ఉన్న అద్దె వసూలు చేయడానికి వచ్చి, తాళం పగులగొట్టడంతో ఈ దారుణం బయటపడింది.
బాధితురాలు హుమైరా తమన్నా ఫిర్యాదు ప్రకారం… ఆమె బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్లో ఉంటున్న సమయంలో మహమ్మద్ ఫయాజ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఫయాజ్, మే నెలలో ఆమె కుటుంబసభ్యులకు చెప్పకుండా భారత్‌కు తీసుకువచ్చాడు. హైదరాబాద్ వచ్చాక మూడు, నాలుగు రోజుల్లోనే ఇద్దరూ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన నెల రోజుల తర్వాత, ఫయాజ్ మయన్మార్‌కు చెందిన తన ముగ్గురు స్నేహితులు అహ్మద్ ముజీబ్, నూర్ కమల్, జియా-ఉర్-రెహమాన్లను తాము ఉంటున్న అద్దె ఇంటికి తీసుకువచ్చాడు. ఆ తర్వాత అసలు నరకం ప్రారంభమైంది. భర్త ఫయాజ్ బయటకు వెళ్తూ ఇంటికి బయటి నుంచి తాళం వేసి, తన స్నేహితులను లోపలికి పంపేవాడు. వారు ఆమెపై దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టేవారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని అందులో ఇద్దరు ఆమెను తీవ్రంగా బెదిరించారు. భాష తెలియకపోవడం, ఎవరిని సహాయం అడగాలో పాలుపోకపోవడంతో పాటు భయం వల్ల ఆమె ఈ అకృత్యాన్ని వెంటనే బయటకు చెప్పలేకపోయింది.
Also Read
- Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
- IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
- CM Chandrababu: రెబల్స్ పోటీ చేస్తే చర్యలు తప్పవు.. కూటమి అభ్యర్థులకు సీఎం వార్నింగ్!
- UP Election Commission: ‘రామ్‌నే యాదవ్ కో మారా’.. ఓటర్ల జాబితాలో వింత పేరు.. యూపీ సీఈవో క్షమాపణలు
అక్టోబర్ 23న అద్దె డబ్బుల కోసం వచ్చిన ఇంటి యజమాని, బయట తాళం వేసి ఉండటంతో దాన్ని పగులగొట్టి తెరవడంతో గుట్టురట్టైంది. వెంటనే మరొకరి మొబైల్ ఫోన్ సాయంతో బాధితురాలు బంగ్లాదేశ్‌లోని తన కుటుంబసభ్యులకు సమాచారం అందించగా, వారు ఇక్కడ ఉన్న బంధువులకు విషయం చెప్పారు. దాంతో ఆమెను బంధువుల ఇంటికి తరలించారు. అక్టోబర్ 26న బాధితురాలి బంధువు మహమ్మద్ రషీద్ ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఆ నలుగురిపై అత్యాచారం, అక్రమ బంధనం, క్రిమినల్ బెదిరింపుల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Hyderabad: పెళ్లి పేరుతో నమ్మించి తెచ్చి నరకం చూపించాడు..
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
CM Chandrababu: రెబల్స్ పోటీ చేస్తే చర్యలు తప్పవు.. కూటమి అభ్యర్థులకు సీఎం వార్నింగ్!
-
UP Election Commission: ‘రామ్‌నే యాదవ్ కో మారా’.. ఓటర్ల జాబితాలో వింత పేరు.. యూపీ సీఈవో క్షమాపణలు
ట్రెండింగ్
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!