NTV Telugu Site icon

Hyderabad-Vijayawada highway Closed: హైదరాబాద్- విజయవాడ మధ్య రాకపోకలు బంద్..

Hyd Vja

Hyd Vja

Hyderabad-Vijayawada highway Closed: బంగాళఖాతంలో వాయుగుండం ఏర్పడటంతో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలను వరద నీరు ముంచెత్తాయి. ఆంధ్రప్రదేశ్ లో 294 గ్రామాలు ముంపు బారిన పడగా.. ఇప్పటి వరకు 13, 227 మంది ప్రజలను పునరావాస శిబిరాలకు ఏపీ సర్కార్ తరలించింది. వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు తొమ్మిది మంది మృతి చెందారు. అయితే, భారీ వర్షాల వల్ల రోడ్లు అన్నీ పూర్తిగా జలమయమయ్యాయి.

Read Also: IND vs AUS: మైండ్‌ గేమ్స్‌ మొదలు.. మెక్‌గ్రాత్ కూడా గట్టిగా చెప్పలేకపోతున్నాడు: గవాస్కర్

ఇక, హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. మున్నేరు వరద ఉదృతితో నేషనల్ హైవే పై వరద నీరు చేరింది. దీంతో నందిగామ మండలం ఐతవరం గ్రామం దగ్గర 65వ జాతీయ రహదారి పైకి వరద ప్రవాహం కొనసాగుతుంది. నేషనల్ హైవేపై వరద నీరు చేరటంతో నందిగామ పోలీసులు రాకపోకలను పూర్తిగా నిలిపి వేశారు. నిన్న (శనివారం) కూడా జాతీయ రహదారి పైకి వరద నీరు చేరడంతో రాకపోకలు క్లోజ్ చేశారు. వరద తగ్గిన తరువాతనే మళ్లీ వాహనాలు రాకపోకలు ముందుకు సాగాయి. తాజాగా మళ్లీ వరద ఎక్కువ కావడంతో హైదరాబాద్- విజయవాడ మధ్య రాకపోకలు బంద్ చేశారు.