Site icon NTV Telugu

Hyderabad: మాజీ భర్త కిరాతకం.. రెండో పెళ్లి చేసుకుందని కత్తులతో పొడిచి దారుణ హత్య

Hyderabad

Hyderabad

Hyderabad: హైదరాబాద్ వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని సునీత (30)ను ఆమె మాజీ భర్త మహేష్ అత్యంత కిరాతకంగా హత్య చేయడం షాక్‌కు గురిచేసింది. పోలీసులు కథనం ప్రకారం.. సునీత కొన్ని రోజుల క్రితమే మహేష్‌కు విడాకులు ఇచ్చి రెండో వివాహం చేసుకుంది. దీంతో మాజీ భర్త లేపేసేందుకు ప్లాన్ వేశాడు. దీంతో తాజాగా మహేష్ రెండు కత్తులు, పెట్రోల్ డబ్బాతో సునీత ఇంట్లోకి చొరబడ్డాడు. ముందుగా ఆమెతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం కత్తులతో తీవ్రంగా గాయపరిచాడు. పూలకుండీతో తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. సునీత రక్తపు మడుగులో పడిఉండగా, మహేష్ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. పరారీలో ఉన్న మహేష్‌ను కొద్ది గంటల్లోనే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విడాకులు తీసుకుని మరో వివాహం చేసుకోవడాన్ని సహించలేకపోయిన మహేష్ ఈ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

READ MORE: Pakistan Hockey Team: నడిరోడ్డుపై పాకిస్థాన్ జట్టు.. ఆస్ట్రేలియాలో పాక్ ఆటగాళ్లకు ఘోర అవమానం!

Exit mobile version