Hyderabad :హైదరాబాద్ లో విషాదం.. కుటుంబంలో నలుగురు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుట్టిన వాడు గిట్టక తప్పదు.. మరణించిన వాడు పుట్టక తప్పదు.. అని బ్రహ్మం గారి కాలజ్ఞానం చెబుతుంది.. మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఊహించడం కష్టమే.. కుటుంబంలో కొన్ని బంధాలు మనసుకు ముడిపడి ఉంటాయి వాటిని మర్చిపోవడం అంత సులువు కాదు.. ఒకరికి కష్టం వస్తే మరొకరు తల్లడిల్లి పోతారు.. ఒకరి కాల్లో ముల్లు గుచ్చుకున్న అవతలి వాళ్ల కంట్లో నీళ్లు తిరుగుతాయి.. అలాంటి కుటుంబాన్ని మృత్యువు విడగొట్టింది.. వారి సంతోషాన్ని సగంలోనే ఆవిరి చేసింది.. ఒకరి మరణాన్ని జీర్ణించుకోలేని ఆ కుటుంబం మొత్తం కూడా బలవన్మారణానికి పాల్పడ్డారు.. ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో ఆ ప్రాంతంలో రోదనలు మిన్నంటాయి.. తమ బంధువులు కూడా ఈ మరణాలను జీర్ణించుకోలేక పోతున్నారు.. వారితో గడిపిన క్షణాల ను గుర్తు చేసుకుంటు కన్నీరు మున్నీరు అవుతున్నారు.. ఈ హృదయ విధార క ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది..
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లో ఓ విషాద ఘటన వెలుగు చూసింది..బోయిన్‌పల్లిలోని ఓ ఇంట్లో కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. తల్లితో సహా ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు..ఇటీవలే తండ్రి చనిపోయాడన్న మనస్తాపంతో వీరు బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. మృతులను తల్లి విజయలక్ష్మీ, కూతుళ్లు చంద్రకళ, సౌజన్యలుగా గుర్తించారు.. బోయిన్‌పల్లిలో నివాసం ఉంటున్న ఓ కుటుంబం లో వరుస మరణాలు అందరిని కలిచి వేస్తున్నాయి..
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
ఇటీవల భర్త అనారోగ్యంతో మరణించడంతో అది తట్టుకోలేని భార్య, ఇద్దరు కూతుర్లు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు.. వీరి మరణంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.. స్థానికుల వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహలను పోస్టు మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.. ఏది ఏమైనా ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయాలు అలుముకున్నాయి.. బంధువుల భాధ వర్ణనాతీతం..
తాజావార్తలు
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!