Hyderabad: అల్వాల్లో విషాదం.. విద్యుత్ షాక్తో తండ్రీకూతురు మృతి.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ నగరంలోని అల్వాల్ ప్రాంతంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షం కారణంగా కారుపై పడిన చెట్టు కొమ్మలను తొలగించే ప్రయత్నంలో విద్యుత్ షాక్కు గురై తండ్రి, కూతురు మృతి చెందారు. ఈ ఘటనతో టెలికాం కాలనీ పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
స్థానికుల వివరాల ప్రకారం.. అల్వాల్ పరిధిలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఓ చెట్టు విరిగి సందీప్ కుటుంబానికి చెందిన కారుపై పడింది. దీంతో కారుపై ఉన్న చెట్టు కొమ్మలను తొలగించేందుకు సందీప్ తన కుమార్తె రితికతో కలిసి ప్రయత్నించారు. ఈ క్రమంలో చెట్టు కొమ్మలు సమీపంలోని విద్యుత్ తీగలకు తగలడంతో విద్యుత్ షాక్కు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన సందీప్, రితిక అక్కడికక్కడే మృతి చెందారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన సందీప్ భార్య శ్వేతకు స్వల్ప గాయాలయ్యాయి.
Also Read
మృతురాలు రితిక ఇంటర్మీడియట్ చదువుతుంది. చిన్న వయసులోనే ఆమె మృతి చెందడం కుటుంబ సభ్యులను, బంధువులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఒకే ఘటనలో తండ్రీకూతురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!