Telangana Formation Day Celebrations : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆదివారం జరిగే ఉత్సవాలు, అలాగే బీఆర్‌ఎస్ మూడు రోజులపాటు నిర్వహించే వేడుకలు నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సందర్భంగా, హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్, గన్ పార్క్, పరేడ్ గ్రౌండ్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు అవుతాయి. ట్యాంక్ బండ్‌పై శనివారం ఉదయం నుంచి ఆదివారం రాత్రి 12 గంటల వరకు, గన్ పార్క్ వద్ద ఆదివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ఆదివారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయి. వాహనదారులు ఈ సమయంలో వాహనదారులు ప్రత్యేక మార్గాలలో ప్రయాణించాలని ఆదేశాలు జారీ చేశారు.