NTV Telugu Site icon

Hyderabad: హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Charminor

Charminor

రంజాన్ చివరి శుక్రవారం సందర్భంగా హైదరాబాద్, పాతబస్తీలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. చార్మినార్-మదీనా, చార్మినార్-ముర్గీ చౌక్, చార్మినార్-రాజేశ్ మెడికల్ హాల్, శాలిబండ మధ్య ప్రధాన రహదారుల్లో ఉదయం 9 గంటల నుంచి అన్ని రకాల వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ఈ ఆంక్షలు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటాయని పేర్కొన్నారు.

Also Read : Telugu Student: అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్య..

అయితే చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్ ను వివిధ పాయింట్ల వద్ద దారి మళ్లీస్తున్నారు. నయాపూల్ వైపు నుంచి చార్మినార్ వైపు వచ్చే ట్రాఫిక్ ను మదీనా జంక్షన్ వద్ద సిటీ కాలేజీ వైపు మళ్లీస్తున్నారు. అదే విధంగా హిమ్మత్ పురా, చౌక్ మైదాన్ ఖాన్, మోతిగల్లి, ఈతేబార్ చౌక్, సెహర్-ఎ-బాటిల్ కమాన్, లక్కడ్ కోటే వద్ద ట్రాఫిక్ ను మళ్లీస్తున్నారు. మక్కా మసీద్ కు వచ్చే వాహనాలను ఏడు వేర్వేరు చోట్ల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. చివరి శుక్రవారం కావడంతో మసీదు చుట్టు పక్కలా ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. ప్రార్థనలు చేసుకునేందుకు వచ్చే వారి సౌకర్యార్థం పార్కింగ్, ఇతర సౌకర్యాలపై ప్రత్యేకంగా నజర్ పెట్టారు.

Also Read : Fast X: దీన్ని మించిన యాక్షన్ సినిమా చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ రా…

హైదరాబాద్ లో వాహనాల దారీ మళ్లీంపుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నగరంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు అప్రమత్తమైయ్యారు. దీంతో చార్మినార్ తో పాటు పాతబస్తీలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అల్లర్లు చెలరేగకుండా పోలీస్ అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు.

Show comments