Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Fast X Trailer 2 Is Filled With Top Notch Action Blocks

Fast X: దీన్ని మించిన యాక్షన్ సినిమా చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ రా…

NTV Telugu Twitter
Published Date :April 21, 2023 , 9:36 am
By Shiva Kranthi
Fast X: దీన్ని మించిన యాక్షన్ సినిమా చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ రా…
  • Follow Us :
  • google news
  • dailyhunt

వరల్డ్ సినిమాలో ఎన్నో యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాలు వచ్చి ఉంటాయి, ఇకపై కూడా వస్తాయి కానీ ‘ఫాస్ట్ అండ్ ఫ్యురియస్’ రేంజ్ యాక్షన్ ఫ్రాంచైజ్ ఇప్పటివరకూ రాలేదు, ఇకపై కూడా రాకపోవచ్చు. యాక్షన్ బ్లాక్స్ కి, కార్ రేసింగ్ సీన్స్ కి, హై రిస్క్ స్టంట్స్ కి కేరాఫ్ అడ్రెస్ ‘ఫాస్ట్ అండ్ ఫ్యురియస్ ఫ్రాంచైజ్’. ఈ ఫ్రాంచైజ్ నుంచి పదో సినిమా, ‘ఫాస్ట్ X’ అనే టైటిల్ తో మే 19న ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ యాక్షన్ ఎక్స్ట్రావెంజా ఫ్రాంచైజ్ ఈ సినిమాతో కంప్లీట్ అవుతుంది కాబట్టి మూవీ లవర్స్ ‘ఫాస్ట్ X’ సినిమాని ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ రేంజులో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఇప్పటివరకూ ఫాస్ట్ అండ్ ఫ్యురియస్ ఫ్రాంచైజ్ లో కనిపించిన ప్రతి సెలబ్రిటీని మళ్లీ తీసుకోని వచ్చారు, కొత్త క్యారెక్టర్స్ ని కూడా యాడ్ చేశారు. దీంతో ఫాస్ట్ X సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. విన్ డీజల్ ఫ్రాంచైజ్ ఎండింగ్ సినిమాలో గెలిచి, తన ఫ్యామిలీని కాపాడుకోని ఫ్రాంచైజ్ కి విన్ డీజల్ ఇవ్వబోయే గ్రాండ్ క్లోజింగ్ ఏ రేంజులో ఉంటుందో చిన్న శాంపిల్ చూపిస్తూ ఫాస్ట్ X ట్రైలర్ 2 బయటకి వచ్చింది.

లూయిస్ లెటెరియర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫాస్ట్ X’ ఇప్పటివరకూ ఈ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన అన్ని సినిమాల కన్నా టెన్ టైమ్స్ గ్రాండ్ గా ఉంది. విన్ డీజల్, జాసన్ మోమోవా, హెలెన్ మిర్రెన్, చార్లీజ్ థెరాన్, జాసన్ స్టాథమ్, మిచెల్ రోడ్రిగ్జ్, టైరీస్ గిబ్సన్, క్రిస్ “లుడాక్రిస్” బ్రిడ్జెస్, నథాలీ ఇమ్మాన్యుయెల్, జోర్డానా బ్రూస్టర్, సుంగ్ కాంగ్, జాన్ సెనా, స్కాట్ ఈస్ట్‌వుడ్, రీటా మోరెనో, అలాన్ రిచ్ట్‌సన్, డానియెలా మెల్చియర్ మరియు బ్రీ లార్సన్‌ ల హ్యూజ్ స్టార్ కాస్ట్ ఫాస్ట్ X ట్రైలర్ లో కనిపించారు. ఎప్పటిలాగే హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్, రేసీ కార్ చేజ్ ఎపిసోడ్స్, ఫైట్స్ తో ఫాస్ట్ X ట్రైలర్ లో మరింత గ్రాండ్ గా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ లో కోట్ల కర్చు కనిపిస్తోంది. ఫ్రాంచైజ్ క్లోజింగ్ సినిమా అనేది పర్ఫెక్ట్ ఇలానే ఉండాలి అనే రేంజులో ఎక్కడా తగ్గకుండా మేకర్స్ ఈ సినిమాని తెరకెక్కించినట్లు ఉన్నారు. ముఖ్యంగా విన్ డీజల్, జాసన్ మోమోవా మధ్య బిల్డ్ చేసిన ట్రాక్ మొత్తం ఫాస్ట్ అండ్ ఫ్యురియస్ ఫ్రాంచైజ్ కే హైలైట్ అయ్యేలా ఉంది. మరి ఈ ఫ్రాంచైజ్ చూసిన స్ట్రాంగెస్ట్ విలన్ నుంచి తన ఫ్యామిలీని విన్ డీజల్ ఎలా కాపాడుకుంటాడు అనేది చూడాలి.

Not all races can be won. Get tix to #FASTX: https://t.co/3zrqJt6ctw pic.twitter.com/lbutll28vK

— The Fast Saga (@TheFastSaga) April 19, 2023

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Fast and Furious 10
  • Fast X
  • Fast X on May 19th
  • Fast X Release Date
  • Fast X Trailer

తాజావార్తలు

  • Off The Record: ఆ సమస్యను వైసీపీ లీడర్స్‌ ఎందుకంత లైట్‌ తీసుకున్నారు..?

  • Anchor Swecha: యాంకర్ స్వేచ్చ ఆత్మహత్య వేళ.. పూర్ణచందర్ సంచలన లేఖ

  • Off The Record: పిఠాపురంలో వైసీపీ నేతలు సైలెంట్ గా సైడవుతున్నారా..?

  • Revanth Reddy : ఎన్ కన్వెన్షన్ ను కూల్చినా నాగార్జున చెరువు కోసం రెండెకరాలు ఇచ్చాడు

  • Health Tips: ఈ ఫుడ్స్ వండేందుకు ప్రెషర్ కుక్కర్ వాడుతున్నారా? అయితే ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లే!

ట్రెండింగ్‌

  • Viral Video: ఇది కాకి కాదు మేధావి.. ఈ వీడియో చూశాక దీని తెలివితేటలకు సలాం కొట్టాల్సిందే..!

  • Best Smartphones: రూ.15,000లోపు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫోన్లు ఇవే..!

  • BSNL 1499: ‘దేశానికి తోడుగా’ అంటూ.. కొత్త ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్..!

  • Controversy Marriage: సభ్యసమాజానికి షాక్: 65ఏళ్ల అమ్మమ్మను పెళ్లి చేసుకున్న 21ఏళ్ల మనవడు!

  • Credit Card: క్రెడిట్ కార్డున్న వ్యక్తి మరణిస్తే.. బకాయి ఎవరు చెల్లించాలి..? రూల్స్ ఏం చెబుతున్నాయంటే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions