Hyderabad: హైదరాబాద్‌లో కలకలం.. ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు బాలికలు మిస్సింగ్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్‌లో ముగ్గురు మైనర్ బాలికలు ఒకేసారి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. దోమలగూడ ప్రాంతానికి చెందిన ముగ్గురు బాలికలు ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కార్మిక కుటుంబాలు దోమలగూడలోని ఫరీద్ బస్తీలో నివాసం ఉంటున్నాయి. అదే ప్రాంతానికి చెందిన సహిత కుమారి, స్నేహ కుమారి, లత అనే ముగ్గురు మైనర్ బాలికలు ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో వారి తల్లిదండ్రులు దోమలగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Also Read
ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి బాలికలు వెళ్లిన మార్గాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. విచారణలో బాలికలు మొదట హిమాయత్‌నగర్‌లో ఓ ఆటో ఎక్కినట్లు గుర్తించారు. ఆ తర్వాత వారు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో నమోదైంది. దర్యాప్తులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి బాలికలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం రెండు రైల్వే స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్నంగా పరిశీలిస్తూ వారి కదలికలను ట్రాక్ చేస్తున్నారు.
బాలికలు తమ స్వగ్రామమైన ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లి ఉండొచ్చనే అనుమానంతో పోలీసులు ఆ దిశగా కూడా విచారణ చేపట్టారు. రైల్వే అధికారులు, ఇతర జిల్లాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. మరోవైపు ముగ్గురు బాలికల ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడంతో వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. బాలికలను వీలైనంత త్వరగా గుర్తించి సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!