Hyderabad: నేడు శ్రీరామనవమి శోభాయాత్ర.. నగరంలోని ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Rama Navami Procession in Hyderabad: నేడు శ్రీరామనవమి. రాష్ట్రంలోని అన్ని రామాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పలు ఆలయాల్లో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించనున్నారు. హైదరాబాద్ నగరంలోనూ పెద్ద ఎత్తున వేడుకలు జరగనున్నాయి. నేడు హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర ఘనంగా నిర్వహించనున్నారు.. ఉదయం 9 గంటలకు సీతారాంబాగ్, ఆకాశ్‌పురి హనుమాన్ ఆలయం నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో సుల్తాన్‌బజార్ హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర కొనసాగనుంది.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్లు ఉండనున్నాయి. ఈ శోభాయాత్రకు 3 వేల మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు..
READ MORE: Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. పండగ పూట ఆ రాశి వారికి అన్ని అనుకూలమే!
Also Read
ఇక ట్రాఫిక్ ఆంక్షల విషయానికి వస్తే.. సీతారాంబాగ్ బోయగూడ కమాన్ నుంచి వచ్చే వాహనాలను మల్లేపల్లి ఎక్స్ రోడ్స్ వైపు మళ్లించనున్నారు. మంగళ్‌హాట్, గాంధీ విగ్రహం, పురానాపూల్, జుమేరాత్ బజార్ నుంచి వచ్చే వాహనాలను టక్కర్‌వాడీ జంక్షన్ వైపు మళ్లించనున్నారు. ఎంజే బ్రిడ్జ్, బేగంబజార్, అఫ్జల్‌గంజ్, సిటీ కాలేజీ వైపు వెళ్లే వాహనాలు జుమ్మేరాత్ బజార్ మీదుగా వాహనాలను డైవర్ట్ చేస్తారు. అబిడ్స్ జీపీఓ, సుల్తాన్ బజార్, కోఠి, అబిడ్స్ ప్రధాన రోడ్ల వద్ద ట్రాఫిక్ పూర్తిగా నిలిపివేస్తారు. బేగంబజార్, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, కోఠి, కాచిగూడ, అబిడ్స్ ప్రాంతాల్లో శోభాయాత్ర సజావుగా సాగేందుకు వాహనదారులు పోలీసులకు సహకరించాలని, సాధ్యమైనంత వరకు యాత్ర సాగే మార్గాల్లో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్జప్తి చేశారు. ఈ ఏరియాల్లో వెళ్లే వ్యక్తులు జాగ్రత్తలు వహించండి. పోలీసుల సూచనల మేరకు ప్రత్నామ్నాయ దారులు ఎంచుకోండి.
📢 TRAFFIC ADVISORY: SRI RAMANAVAMI SHOBHA YATRA
In view of the Sri Ramanavami Shobha Yatra scheduled for March 27, 2026, from 9:00 AM to 9:00 PM, traffic diversions will be implemented along the procession route from Seetarambagh Temple to Sultan Bazar.
📍 Route Highlights:… pic.twitter.com/WXlQGpCUQl
— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) March 26, 2026
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?