Electric Shock: విద్యుత్ తీగ తగిలి విద్యార్థిని మృతి, మరో బాలికకు గాయాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Electric Shock: హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని నైట్ ఏంజెల్ హోమ్‌లో విద్యుత్ షాక్‌కు గురై ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. మరో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో హోమ్‌లో విషాదం నెలకొంది. అందిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో హోమ్‌లోని విద్యార్థినులు వెనుకవైపు ఉన్న గేట్ గ్రిల్ ద్వారా రెండో అంతస్తుకు వెళ్లారు. మొదటి అంతస్తు నుంచి రెండో అంతస్తుకు వెళ్లకుండా తలుపు వద్ద గ్రిల్ ఏర్పాటు చేసినప్పటికీ, హాస్టల్ వెనుక ఉన్న గేట్ నుంచి పైకి చేరుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఆడుకుంటుండగా మూడో తరగతి చదువుతున్న రెబెకాకు విద్యుత్ తీగ తగిలింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
ఈ ఘటనలో మరో విద్యార్థిని నందిని చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. మరో విద్యార్థిని తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. సమాచారం అందుకున్న హోమ్ ఇన్చార్జి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ముషీరాబాద్ పోలీసులు వివరాలు సేకరించారు. విద్యుత్ షాక్‌కు గురైన నందినిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆమెను డిశ్చార్జ్ చేసినట్లు సమాచారం. మృతి చెందిన రెబెకా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థినులు రెండో అంతస్తుకు ఎలా చేరుకున్నారు.? అక్కడ విద్యుత్ తీగలు ఎలా ఉన్నాయి? అనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
Also Read
- IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..
- AP Panchayat Elections: తొలి దశ పంచాయతీ ఎన్నికలు.. నేటితో నామినేషన్లకు తెర
- Janasena vs Janasena: నేను 2 ఎకరాలు ఇస్తా.. 3 ఎకరాలైనా నేను సిద్ధం.. సర్పంచ్ పదవి కోసం జనసేన నేతల మధ్య తీవ్ర పోటీ..!
- CM Chandrababu Delhi Tour: మరోసారి ఏపీ సీఎం హస్తిన బాట.. కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు
తాజావార్తలు
-
Electric Shock: విద్యుత్ తీగ తగిలి విద్యార్థిని మృతి, మరో బాలికకు గాయాలు..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..
-
AP Panchayat Elections: తొలి దశ పంచాయతీ ఎన్నికలు.. నేటితో నామినేషన్లకు తెర
-
PM Modi in Philippines: మనీలాలో వందేళ్ల చరిత్ర కలిగిన గురుద్వారాను సందర్శించిన మోడీ.. పునరాభివృద్ధి పనులకు శ్రీకారం
-
Mammootty: మీకోసమే ఇక్కడికి వచ్చాను.. తెలుగు ప్రేక్షకులపై మమ్ముట్టి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్‌లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్‌ను వదులుకుంటున్న ఆర్ఆర్!
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!