Site icon NTV Telugu

Rain Alert: ఉదయాన్నే మొదలు పెట్టిన వరణుడు.. హైదరాబాదు వాసుల్లారా దయచేసి బయటికి రాకండి!

Rain Effect

Rain Effect

Rain Alert: రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తా జిల్లాలలో భారీగా వర్షం కురుస్తుండగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రాష్ట్రం మొత్తం వరుణిడికి దెబ్బకి అతలాకుతలమయ్యింది. ఇక తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం సంగతి గురించి చెప్పనక్కర్లేదు. కొద్దిపాటి వర్షం పడితేనే జలమయమయ్యే రోడ్లతో ఇబ్బంది పడే నగరవాసులు ఇప్పుడు కుండపోత వర్షం కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

illicit Affairs: తిరుపతిలో దారుణం.. కూతురు ముందే అల్లుడితో పెళ్ళికి తల్లి యత్నం..

శనివారం రాత్రి భాగ్యనగరంలో భారీ వర్షం కురవగా.. తెల్లవారుజామున కాస్త బ్రేక్ ఇచ్చింది. అయితే, ఉదయం మళ్లీ మరణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దీంతో నగరంలోని గాంధీ ఆసుపత్రి, సీతాఫల్ మండి, పార్సిగుట్ట, మెట్టుగూడ, చిలకలగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, బేగం బజార్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహదీపట్నం, గుడిమల్కాపూర్, టోలిచౌకి, షేక్ పేట్, కూకట్ పల్లి, అమీర్ పెట్ ఇలా నగరంలోని పలు ప్రాంతాలలో రోడ్లన్నీ జలమయమయ్యాయి.

Ajit Agarkar: కెప్టెన్ ఎంపిక నిర్ణయం వెనుక చాలా పెద్ద విషయముంది.. అర్థం చేసుకోండి

కాబట్టి నగరప్రాంతవాసులు వీలైనంతవరకు బయటకి రాకపోవడమే మంచిది. ఏదైనా అత్యవసరమైతే తప్పించి నగరవాసులు బయటికి రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Exit mobile version