Hyderabad Police Warning: ఇటీవల కాలంలో ట్రాఫిక్ పోలీసులు ఎంత మొత్తుకున్నా ఎంత అవగాహన కార్యక్రమాలు చేపట్టిన వాహనదారులు మాత్రం రోడ్డు నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా వారి ప్రాణాలను రిస్కులో పెట్టుకోవడమే కాదు ఇక అభం శుభం తెలియని అమాయకుల ప్రాణాలను కూడా తీసేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తూనే ఉన్నాయ్. ముఖ్యంగా మద్యం తాగి వాహనం నడిపితే ఊరుకునే ప్రసక్తేలేదని జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ఎంతోమంది వాహనదారుల తీరులో మార్పు రావడం లేదు.
ఫుల్లుగా మద్యం తాగడం ఇక ఆ తర్వాత వాహనం నడపడం ఆపై ఎక్కడో ఒకచోట యాక్సిడెంట్ చేసి ఇక తమ ప్రాణాలు పోగొట్టుకోవడం లేదా ఇతరుల ప్రాణాలు తీయడం లాంటివి చేస్తున్నారు. ఇలాంటి ఘటనల కారణంగా ఎన్నో కుటుంబాల్లో విషాదం నిండిపోతుంది. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహిస్తున్నప్పటికీ మద్యం మత్తులో వాహనం నడుపుతున్న వారి సంఖ్య మాత్రం ఎక్కడా తగ్గడం లేదు అని చెప్పాలి. ఒకరకంగా నేటి రోజుల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మద్యం తాగి వాహనాలు నడపడం కారణంగానే అని చెప్పాలి. అయితే మందుబాబులకు బ్రేకులు వేసేందుకు మరో రూల్ తీసుకురానున్నారు పోలీసులు. ఇప్పటి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే జరిమానా, కనిష్టంగా జైలుశిక్ష విధిస్తుండే వారు. కానీ ఇకపై నుంచి పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే.. నేరుగా చర్లపల్లి జైలుకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు కారణం అక్కడ పారిశ్రామిక యూనిట్ ఉండటం. జైలులో పని చేయించడంతో ఉత్పత్తికి తోడు వారిలో మార్పు వస్తుందని పోలీసులు భావిస్తున్నారు.
Read Also: Wedding Kit: వెడ్డింగ్ కిట్‌లో కండోమ్‌లు, బర్త్ కంట్రోల్ పిల్స్.. ప్రభుత్వ కొత్త పథకం!
ఇంతవరకు డ్రంక్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే ఏదో జరిమానా కట్టి బయటకు వచ్చేస్తాం లే అనుకునే వాళ్లు మందుబాబులు. కానీ ఈ రూల్‌ను తీసుకొస్తే అలా ఉండదు. సచ్చినట్టు జైలుకు వెళ్లాల్సిందే. అలా చేయడం ద్వారా ప్రమాదాల నివారణ అరికట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇంకేముంది మరీ మద్యం తాగి రోడ్డెక్కుతారా.. లేదా తాగి కామ్‌గా ఇంట్లోనే ఉంటారా అనేది మందుబాబులు ఆలోచించుకోవాలి. ఏమవుతుందిలే అని రోడ్డెక్కారా.. పోయి జైలు ఊసలు లెక్కపెట్టాల్సిందే. సో బీ కేర్ ఫుల్ మందుబాబులు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఇది బెస్ట్ ఆప్షన్ అంటున్నారు అందరూ.
