బాంబ్ బెదిరింపు కేసులో హైదరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు టాస్క్ఫోర్స్ పోలీసులు. నిందితుడు గుంటూరుకు చెందిన రామకృష్ణగా గుర్తించి.. అతన్ని అరెస్ట్ చేశారు. నిన్న ఉదయం పంజాగుట్ట ప్రజా భవన్ లో, నాంపల్లి కోర్టులో బాంబ్ పెట్టాము అంటూ పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి టెన్షన్ క్రియేట్ చేశాడు రామకృష్ణ. అయితే.. నిందితుడు భార్యతో గొడవ పడి మధ్యనికి బానిసగా మారి, భార్య లేదన్న బాధలో ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
Read Also: Niranjan Reddy: ఫోన్ ట్యాపింగ్.. లీగల్ సెన్స్ లేని నాన్సెన్స్
కాగా.. నిన్న ( మంగళవారం ) రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కుటుంబం నివాసం ఉంటున్న ప్రజా భవన్లో బాంబు ఉన్నట్లు నిందితుడు 100కు డయల్ చేసి చెప్పాడు. దీంతో రాష్ట్ర పోలీస్ శాఖ వెంటనే అప్రమత్తమయింది. ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ పోలీస్ అధికారులను రంగంలోకి దింపింది. హుటాహుటిన బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ప్రజాభవన్కు చేరుకొని అడుగడుగున తనిఖీలు చేపట్టారు. ప్రజాభవన్ ఎంట్రన్స్ నుంచి నివాసం లోపల ఉన్న అన్ని గదులను, బెడ్రూమ్స్, కిచెన్, డైనింగ్ హాల్, విజిటర్ హాల్స్, ఉప ముఖ్యమంత్రి ఛాంబర్, జిమ్, గార్డెన్, పరిసర ప్రాంతాలను అణువణువునా డాగ్ స్క్వాడ్ బృందం పోలీసులు తనిఖీలు చేశారు.
Read Also: Dry Fruits: రోజూ ఈ మూడు డ్రైఫ్రూట్స్ తింటే ఎన్నోలాభాలున్నాయి.. అవేవో చూద్దాం