Site icon NTV Telugu

Movie Piracy: నెలకు 9 లక్షలు జీతం.. పైరసీ రాయుళ్ల కలెక్షన్ మాములుగా లేదుగా

Movie Piracy

Movie Piracy

Movie Piracy: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ CV ఆనంద్ పైరసీ రాయుళ్ల విషయమై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సినిమాల పైరసీపై లోతైన దర్యాప్తు చేసి దేశంలోనే తొలిసారిగా ఒక పైరసీ ముఠాను పట్టుకున్నామని తెలిపారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు మేరకు ఈ కేసును నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. పైరసీ కారణంగా సినీ పరిశ్రమ భారీగా నష్టపోతోందని సీపీ వివరించారు. 2023లో దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమకు రూ.22,400 కోట్లు, 2024లో తెలుగు పరిశ్రమకు రూ.3,700 కోట్లు పైరసీ వల్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. పైరసీ సినిమాల వల్ల ప్రజలు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు కూడా అలవాటు పడుతున్నారని ఆయన చెప్పారు. బెట్టింగ్ యాప్ నిర్వాహకులు పైరసీ చేసేవారికి డబ్బులిచ్చి ప్రోత్సహిస్తున్నారని, పైరసీ మూవీల ద్వారా తమ యాప్‌లను ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు.

KTR: రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడెల్ వాయించినట్టుగా ఉంది సీఎం తీరు.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఈ కేసులో ప్రధాన నిందితుడు తమిళనాడులోని కరూర్ చెందిన సిరిల్ అని పోలీసులు గుర్తించారు. అతను 2020 నుంచి నాలుగు పైరసీ వెబ్‌సైట్‌లను నడుపుతున్నాడు. కంప్యూటర్ సైన్స్ చదివిన సిరిల్ సులభంగా డబ్బు సంపాదించడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఏజెంట్లను నియమించుకుని అన్ని భాషల సినిమాలను పైరసీ చేస్తున్నాడు. హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో ఉన్న మంత్ర మాల్ థియేటర్‌లో జానా కిరణ్ కుమార్ అనే వ్యక్తి హై ఎండ్ కెమెరా ఉన్న ఫోన్‌తో సినిమాలను రికార్డ్ చేశాడు. స్క్రీన్ ఆఫ్ అయినప్పటికీ వీడియో రికార్డ్ చేసే యాప్‌లను ఉపయోగించి ఎవరికీ అనుమానం రాకుండా ఈ పని చేశాడని తెలిపారు.

22 ఏళ్ల అశ్విని కుమార్ అనే మరో నిందితుడు డిజిటల్ మీడియా సర్వర్లను హ్యాక్ చేసి సినిమాలు అప్‌లోడ్ చేస్తున్నాడు. ఇతను 1020 సినిమాలు నేరుగా సర్వర్లను హ్యాక్ చేసి అప్‌లోడ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇతను కేవలం సినిమాలకు సంబంధించి మాత్రమే కాకుండా ప్రభుత్వ విభాగాల వెబ్‌సైట్‌లు, ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌ను కూడా హ్యాక్ చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాడని తెలిపారు.

Bhatti Vikramarka: కాంగ్రెస్ పార్టీని కనిపించకుండా చేయాలని మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు.. డిప్యూటీ సీఎం హాట్ కామెంట్స్

ఈ నిందితులు బిట్‌కాయిన్‌లు, క్రిప్టో కరెన్సీ రూపంలో డబ్బులు తీసుకుంటున్నారు. ప్రతి సినిమాకు 300 నుండి 400 డాలర్లు సంపాదిస్తున్నాడు. ఈ డబ్బును భారతీయ కరెన్సీలోకి మార్చుకోవడానికి అశ్విని కుమార్ అనే వ్యక్తి సహకరిస్తున్నాడు. బెట్టింగ్ యాప్‌లైన 1xbet, 4ra bet, rajbet, Parimatch నిర్వాహకులు సిరిల్‌కు నెలకు రూ.9 లక్షల జీతంలాగా ఇస్తున్నారు. పోలీసులు సిరిల్ వద్ద కుబేర మూవీతో సహా అనేక సినిమాలను, అలాగే 10 క్రిప్టో కరెన్సీ వాలెట్‌లు, మూడు బ్యాంకు ఖాతాలను గుర్తించారు. అశ్విని కుమార్ ఇంటి చుట్టూ 22 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాడని, పోలీసులు రావడం చూసి తన ఫోన్ డేటాను డిలీట్ చేశాడని, కానీ హార్డ్ డిస్క్‌లో ఉన్న డేటాను మాత్రం డిలీట్ చేయలేకపోయాడని సీపీ తెలిపారు.

Exit mobile version