Site icon NTV Telugu

Movie Piracy: భారీ మూవీ పైరసీ గ్యాంగ్ పట్టివేత.. క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు

Movie Piracy

Movie Piracy

Movie Piracy: హైదరాబాద్ నగరంలో విస్తృతంగా కార్యకలాపాలు సాగిస్తున్న భారీ మూవీ పైరసీ రింగ్‌ను పట్టుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ మీడియా ప్రకటన చేశారు. ఈ ఆపరేషన్‌లో పోలీసులు ఐదుగురు కీలక నిందితులను అరెస్టు చేయడమే కాకుండా.. వారి వద్ద నుంచి కంప్యూటర్లు, హార్డ్‌డిస్కులు, ల్యాప్‌టాప్‌లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ పరికరాలు తదితర సాంకేతిక పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. కమిషనర్ తెలిపిన సమాచారం ప్రకారం.. ఈ నిందితులు కొత్తగా విడుదలైన తెలుగు, హిందీ, తమిళ సినిమాలను రహస్యంగా రికార్డ్ చేసి, వాటిని ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అక్రమంగా అమ్మకాలు జరుపుతూ కోట్ల రూపాయల లాభాలను ఆర్జిస్తున్నారని తెలిపారు. ప్రత్యేక బృందాలు వారాల తరబడి నిఘా ఉంచి, చివరకు నిందితుల గ్యాంగ్‌ను పట్టుకున్నట్లు ఆయన వివరించారు.

Sai Pallavi : కోలీవుడ్‌కు దూరంగా సాయి పల్లవి.. కారణం ఏంటి?

సినీ పరిశ్రమను దెబ్బతీసే పైరసీ మాఫియాపై ఎవరూ ఉపేక్షించమని.. పైరసీకి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు. ప్రజలు కూడా థియేటర్లలో సినిమాలు చూసి పరిశ్రమను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడానికి సైబర్ క్రైమ్ పోలీసులు, టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీస్ స్టేషన్ల సిబ్బంది సమన్వయంతో పనిచేశారని కమిషనర్ ప్రశంసించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతుండగా.. ఈ గ్యాంగ్‌కు సంబంధించి మరిన్ని వ్యక్తుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఇది హైదరాబాద్ నగర పోలీసుల తరఫున మూవీ పైరసీపై సాధించిన ఒక పెద్ద విజయంగా పరిగణిస్తున్నారు అధికారులు.

Surya Kumar Yadav: శభాష్.. ఇది కదా దేశభక్తి అంటే.. మ్యాచ్ ఫీజలు మొత్తం?

Exit mobile version