Hyderabad: రేస్ క్లబ్ సమీపంలో భారీ పేకాట స్థావరం గుట్టురట్టు.. 12 మంది అరెస్ట్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ రేస్ క్లబ్ పరిసరాల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న భారీ పేకాట దందాను చాదర్‌ఘాట్ పోలీసులు బట్టబయలు చేశారు. రేస్ క్లబ్ సమీపంలోని GP హబ్ భవనంలో జోరుగా సాగుతున్న మూడు ముక్కల పేకాట శిబిరంపై ఆకస్మిక దాడి చేసి 12 మంది జూదరులను రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 28 రాత్రి మలక్‌పేట పరిధిలోని హైదరాబాద్ రేస్ క్లబ్ పక్కనే ఉన్న GP హబ్ బిల్డింగ్‌లో డబ్బులు పందెంగా పెట్టి అక్రమంగా మూడు ముక్కల పేకాట ఆడుతున్నట్లు చాదర్‌ఘాట్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఉన్నతాధికారుల ఆదేశాలు, మలక్‌పేట ఏసీపీ అనుమతితో రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీస్ బృందం, రాత్రి 10:30 గంటల సమయంలో స్వతంత్ర సాక్షుల సమక్షంలో ఆ భవనంపై మెరుపు దాడి నిర్వహించింది.
Also Read
- Satish Jarkiholi: ఓటర్ల జాబితా నుంచి కోటి పేర్ల తొలగింపు సరైనదే.. కాంగ్రెస్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
- AP Local Elections 2026: ఏపీలో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్!
- బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!
- Hyderabad: తెలంగాణలో ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలపై కొరడా.. 32 మెడికల్ షాపులకు నోటీసులు
ఈ దాడిలో 12 మంది జూదరులను పట్టుకోగా, నిర్వాహకులుగా భావిస్తున్న యాదయ్య, దేవాతో పాటు భవన యజమాని మహమ్మద్ గౌస్ పరారయ్యారు. ఘటనా స్థలం నుంచి రూ. 1,76,170 నగదు, 16 మొబైల్ ఫోన్లు, 4 సెట్ల పేక ముక్కలను పోలీసులు పంచనామా కింద స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గేమింగ్ యాక్ట్ సెక్షన్ 3, 4 కింద క్రైమ్ నంబర్ 423/2026 తో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
తాజావార్తలు
-
Hyderabad: రేస్ క్లబ్ సమీపంలో భారీ పేకాట స్థావరం గుట్టురట్టు.. 12 మంది అరెస్ట్.!
-
US Fed Interest Rate Decision: అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లు యథాతథం
-
Satish Jarkiholi: ఓటర్ల జాబితా నుంచి కోటి పేర్ల తొలగింపు సరైనదే.. కాంగ్రెస్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
-
AP Local Elections 2026: ఏపీలో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్!
-
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!
ట్రెండింగ్
-
WPL Auction 2027: వైభవ్ సూర్యవంశీ మాదిరే.. డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కురాలు.. ఎవరీ ఉమా కాశ్వి!
-
RCB Full Squad: నలుగురు కొత్త ప్లేయర్లు, స్టార్ ఆల్‌రౌండర్లు.. ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
WPL Auction 2027: చాలా తక్కువ ధరకే స్టార్ ప్లేయర్లు.. ముంబై ఇండియన్స్ భలే లక్కీ.. ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
6,100mAh బ్యాటరీ, కిరిన్ 8000S చిప్సెట్, AI సెక్యూరిటీ ఫీచర్లతో Huawei Enjoy 100 స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
Apple మొట్టమొదటిసారిగా టచ్‌స్క్రీన్ సదుపాయం.. PROLED XDR డిస్ప్లే, M5 ప్రాసెసర్లతో MacBook Pro లాంచ్..