Site icon NTV Telugu

HYD Animal Smugglers: రెడ్ శాండిల్ స్మగ్లర్స్.. ఇప్పుడు రూట్ మార్చారు..

Elephant

Elephant

ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న స్మగ్లర్లు.. కొత్త వ్యాపారం మొదలు పెట్టారు. వన్యప్రాణుల చర్మం, దంతాలతో వ్యాపారం షురూ చేశారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉండడంతో వాటి స్మగ్లింగ్‌కు తెరతీశారు. తాజాగా ఏనుగు దంతాలతో వ్యాపారం చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్నాళ్లూ అడవిలోని ఎర్రచందనం చెట్ల వెంట పడ్డ స్మగ్లర్లు.. ఇప్పుడు అడవిలోని వన్యప్రాణులను కూడా వదిలి పెట్టడం లేదు. వాటిని వెంటాడి.. వేటాడి వాటి చర్మం, దంతాలతో స్మగ్లింగ్ వ్యాపారం చేస్తున్నారు.

Also Read:HYD COUPLE P*ORN: భార్యాభర్తల బంధాన్ని.. అంగట్లో సరుకులా అమ్మేశారు..

అలా హైదరాబాద్‌ వరకు విస్తరించిన ఏనుగు దంతాల వ్యాపారానికి కాస్తా పోలీసులు చెక్ పెట్టేశారు. ఏనుగు దంతాల వ్యాపారం చేస్తున్న ముఠాను రాచకొండ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఏనుగు దంతాలు స్మగ్మింగ్ చేస్తున్న ఏపీకి చెందిన రేకులకుంట ప్రసాద్‌ని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రెండు ఏనుగు దంతాలు స్వాధీనం చేసుకున్నారు. ఐతే ప్రసాద్‌తో కలిసి వ్యాపారం చేస్తున్న లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ప్రసాద్ నుంచి స్వాధీనం చేసుకున్న 5.6 కేజీల 2 ఏనుగు దంతాల విలువ ఇంటర్నేషనల్ మార్కెట్లో రూ. 5 కోట్లు ఉంటుందని తెలిపారు.

Also Read:Vu Vibe DV 2025: 4K రిజల్యూషన్, QLED స్క్రీన్ తో వియు వైబ్ డీవీ టీవీ విడుదల.. ధర ఎంతంటే?

ప్రసాద్‌పై ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులు

వాయిస్: ఆంధ్రప్రదేశ్‌, అన్నమయ్య జిల్లా, ఉత్తర ఎగువ కొత్తపల్లి, ఎండపల్లి, రాయచోటికి చెందిన రేకులకుంట ప్రసాద్‌ జల్సాలకు అలవాటు పడ్డాడు. గతంలో ఇతనిపై ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులు కూడా ఉన్నాయి. ఈ కేసులో ఫిబ్రవరి 2025లో తిరుపతి సబ్ జైలులో శిక్ష అనుభవించాడు. ఈ క్రమంలోనే మరో వ్యక్తి లోకేశ్వర్ రెడ్డి అక్కడే పరిచయం అయ్యాడు. వీరిద్దరూ జైల్లో ఉన్నప్పుడే ఏనుగు దంతాల అక్రమ రవాణాకు ప్లాన్‌ వేశారు.

Also Read:Vu Vibe DV 2025: 4K రిజల్యూషన్, QLED స్క్రీన్ తో వియు వైబ్ డీవీ టీవీ విడుదల.. ధర ఎంతంటే?

జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వారి పథకాన్ని అమలు చేశారు. వీరిద్దరూ తిరుపతి జిల్లా శేషాచలం అడవికి వెళ్లి అక్కడి యానాదుల గిరిజనుల నుంచి 2 ఏనుగు దంతాలను తక్కువ ధరకు సేకరించారు. వాటిని హైదరాబాదులో ఎక్కువ ధరకు అమ్మేందుకు ప్రసాద్ తీసుకు వచ్చాడు. వారిద్దరూ అక్రమంగా సంపాదించిన ఏనుగు దంతాలతో ఓ ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు ఎక్కి హైదరాబాద్‌ లో విక్రయించడానికి బయలుదేరారు. ఈ క్రమంలో బస్సులో ఎల్బీనగర్‌ చేరుకున్నారు. పక్కా సమాచారం అందుకున్న ఎల్బీనగర్‌ ఎస్‌ఓటి బృందం హయత్‌ నగర్‌ అటవీ శాఖ అధికారులు కలిసి నిందితుడు ప్రసాద్‌ను ఎల్బీనగర్‌ వద్ద అరెస్టు చేశారు. కానీ అప్పటికే లోకేశ్వర్ రెడ్డి పారిపోయినట్లు తెలుస్తోంది.

Also Read:Vu Vibe DV 2025: 4K రిజల్యూషన్, QLED స్క్రీన్ తో వియు వైబ్ డీవీ టీవీ విడుదల.. ధర ఎంతంటే?

వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972ప్రకారం కేసు నమోదు

మరోవైపు పట్టుకున్న ఏనుగు దంతాలు ఒరిజినల్‌వా నకిలీవా అని పరీక్ష చేయించారు పోలీసులు. ఐతే అవి నిజమైనవేనని తేలింది. దీంతో నిందితుడిపై వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972ప్రకారం కేసు నమోదు చేశారు.

Exit mobile version