NTV Telugu Site icon

Duddilla Sridhar Babu : రూ.5,260 కోట్ల ఫార్మా కంపెనీల పెట్టుబడులు.. 12,490 మందికి ఉద్యోగాలు

Duddilla Sridhar Babu

Duddilla Sridhar Babu

Duddilla Sridhar Babu : దేశంలో పేరొందిన ఫార్మా కంపెనీలు హైదరాబాద్ లో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. తమ కంపెనీల కార్యకలాపాల విస్తరణతో పాటు కాలుష్య రహితంగా ఏర్పాటు చేసే గ్రీన్ ఫార్మా కంపెనీలను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వివిధ ఫార్మా కంపెనీల ప్రతినిధులు శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​ బాబుతో సంప్రదింపులు జరిపారు. ఎంఎస్ఎన్ గ్రూప్, లారస్ ల్యాబ్స్, గ్లాండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్, అరబిందో ఫార్మా, హెటిరో ల్యాబ్స్ కంపెనీల ప్రతినిధులు, టీఎస్ఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, విష్ణువర్ధన్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Maruthi Nagar Subramanyam: కడుపుబ్బా నవ్వించే ‘మారుతీనగర్​ సుబ్రమణ్యం’ వచ్చేస్తుంది.. ఈనెల 24న జీ తెలుగులో

ఈ సందర్భంగా ఫార్మా కంపెనీల ప్రతినిధులు తమ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ఎంవోయూలపై సంతకాలు చేశారు. ఈ ఆరు కంపెనీలు కలిసి దాదాపు రూ.5260 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. వీటి ద్వారా ఫార్మా రంగంలో 12490 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఇప్పటికే ప్రభుత్వం గుర్తించిన ఫార్మా సిటీలో వీటికి అవసరమైన యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించనుంది.

ఎంవోయూల ఒప్పందాల ప్రకారం ఎంఎస్ఎన్ లాబోరేటరీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ తో పాటు ఆర్ అండ్ డీ సెంటర్ నెలకొల్పనుంది. లారస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మా ఫార్ములేషన్ యూనిట్లు నెలకొల్పుతాయి. గ్లాండ్ పార్మా ఆర్ అండ్ డీ సెంటర్, ఇంజెక్టబుల్స్, డ్రగ్ సబ్స్టన్స్ మాన్యుఫాక్చర్ యూనిట్లను స్థాపించనుంది. డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ ఇంజెక్టబుల్, బయో సిమిలర్ల యూనిట్ ఏర్పాటు చేస్తుంది. హెటిరో ల్యాబ్స్ ఫినిషిడ్ డోస్, ఇంజక్టబుల్ తయారీ పరిశ్రమ నెలకొల్పనుంది.

మరో నాలుగు నెలల్లో ఫార్మా కంపెనీలు తమ నిర్మాణ పనులు చేపట్టేందుకు వీలుగా స్థలాలను కేటాయించటంతో పాటు, ఫార్మా సిటీలో అవసరమైన సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ డైరెక్టర్ సతీష్​ రెడ్డి, లారస్ ల్యాబ్స్ ఈడీ వివి రవికుమార్, గ్లాండ్ ఫార్మా సీఈవో శ్రీనివాస్, ఎంఎస్ ల్యాబ్స్ సీఎండీ ఎంఎస్ఎన్​ రెడ్డి, అరబిందో డైరెక్టర్ మదన్​మోహన్​ రెడ్డి, హెటిరో గ్రూప్ ఎండీ బి.వంశీకృష్ణ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Agriculture Market Committee : 11 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గం నియామకం