న్యూ ఇయర్ వస్తుందంటే చాలు.. డ్రగ్స్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది.. ఇప్పుడు హైదరాబాదులో వింత పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ ట్రాన్సిట్ పాయింట్ గా మారిపోయింది. గంజాయి కి కూడా ఇప్పటికే ట్రాన్సిట్ పాయింట్ గా హైదరాబాద్ మారింది. ఆంధ్ర ఒడిస్సా నుంచి హైదరాబాద్ మీదుగా నార్త్ ఇండియా కి గంజాయి సరఫరా అవుతుంది. ఇప్పుడు డ్రగ్స్ కూడా అదే తరహాలో చెన్నై నుంచి హైదరాబాద్ మీదుగా పూణే ల మీద విదేశాలకు డ్రగ్స్ ట్రాన్సిట్ అవుతుంది. హైదరాబాద్ని మాఫియా ట్రాన్సిట్ పాయింట్ గా మాఫియా ఎందుకు ఎంచుకుంది . అసలు హైదరాబాదులో ఏం జరుగుతుంది? నెలల వ్యవధిలోనే వందల కోట్ల రూపాయల డ్రగ్స్ ను విదేశాలకు చెన్నై గ్యాంగ్ పంపించింది.. చెన్నై మాఫియా హైదరాబాద్ మీదుగా డ్రగ్స్ ని విదేశాలకు పంపిస్తుంది.
దాదాపు 200 కోట్ల రూపాయల డ్రగ్స్ ని ఇక్కడి నుంచి పంపించినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే ఇంటర్నేషనల్ కొరియర్ ద్వారా ఈ డ్రగ్స్ విదేశాలకు చేరిపోతున్నట్లుగా హైదరాబాద్ పోలీసులు చెప్తున్నారు. హైదరాబాదులో ఉన్న ఇంటర్నేషనల్ కొరియర్ ద్వారా ఈ డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లుగా అధికారులు తేల్చారు. తమిళనాడులోని శివగంగా కేంద్రంగా డ్రగ్స్ రాకెట్ నడుస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. శివగంగలో 100కు పైగా డ్రగ్స్ ముఠాలు ఉన్నట్లుగా అధికారులు తేల్చారు. రాచకొండ పోలీసులు కు అందిన సమాచారంతో ఒక సప్లయర్ని పట్టుకున్నారు. దాదాపు 18 కోట్ల రూపాయల విలువచేసే డ్రగ్స్ అని స్వాధీనపరుచుకున్నారు. రామరాజు కాటన్ పెళ్లి బట్టల్లో డ్రగ్స్ ని ప్యాకింగ్ చేస్తున్న సమయంలో రాచకొండ పోలీసులు నేరుగా వెళ్లి పట్టుకోవడం జరిగింది.
ఇందులో కోట్ల రూపాయల విలువచేసే మత్తుమందు స్వాధీన పరుచుకున్నారు. పెళ్లి బట్టలు వధూవరుల బట్టలతో పాటుగా అలంకార వస్తువుల్లో ఈ డ్రగ్స్ ని ప్యాక్ చేసి విదేశాలకు పంపిస్తున్నట్లుగా రాచకొండ పోలీసులు తేల్చారు. అయితే ఆ సంఘటనను మర్చిపోకముందే తాజాగా హైదరాబాద్ హెచ్ న్యూ టీం కూడా శివగంగా డ్రగ్స్ ముఠా ను పట్టుకుంది. బేగంపేట పరిధిలో ఉన్న ఇంటర్నేషనల్ కొరియర్ ద్వారా డ్రగ్స్ వెళ్తున్నట్లుగా హైదరాబాద్ పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ సమాచారం అందుకొని కొరియర్స్ సంస్థల పైన నిఘా ముమ్మరం చేశారు . ఇవాళ ఉదయం కొన్ని పార్సెల్ తీసుకొని వచ్చిన ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అదుపు తీసుకున్నారు.
Read also: Jammu Kashmir: పాకిస్తాన్ ఉగ్రకుట్ర భగ్నం.. భారీగా ఆయుధాలు స్వాధీనం..
బావ బామ్మర్దులు ఇద్దరు కలిసి విదేశాలకు కొరియర్ చేస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈసారి డ్రగ్స్ ని కొత్త పందాలు వీళ్లు విదేశాలకు పంపిస్తున్నారు. ఇంటర్నేషనల్ కొరియర్ ద్వారా డైరెక్ట్ గా డ్రగ్స్ ని పంపిస్తే పోలీసులు పట్టుకుంటున్నారని తెలుసుకొని స్థానిక కొరియర్లో డ్రగ్స్ ని బుక్ చేశారు. విదేశాలకు గాజులు పంపిస్తున్నట్లుగా కలరింగ్ ఇచ్చారు. గాజుల మధ్యలో ఉండే సొరగు లో డ్రగ్స్ ను తో నింపిన ప్యాకెట్లను పెట్టారు . ఎవరికి అనుమానం రాకుండా నీటుగా ప్యాక్ చేశారు. అలా ప్యాక్ చేసిన గాజుల డబ్బాలను నేరుగా ఇంటర్నేషనల్ కొరియర్ కి పార్సెల్ బుక్ చేశారు..
ముందస్తుగా హైదరాబాదులో ఉన్న ఐదు స్థానిక కొరియర్లలో ఈ పార్సెల్ ని బుక్ చేశారు. స్థానిక కొరియర్లు నేరుగా తీసుకువచ్చి ఇంటర్నేషనల్ కొరియర్ ద్వారా విదేశాలకు గాజుల డబ్బాలను పంపించే ప్రయత్నం చేశారు. అయితే గాజుల డబ్బాలో చాలా బరువుగా ఉండటంతో ఇంటర్నేషనల్ కొరియర్ లోని సిబ్బందికి అనుమానం వచ్చింది . దీంతో డబ్బాలను తెరిచి చూడగా అందులో గాజులు మాత్రమే కనపడ్డాయి .దీంతో ఇంటర్నేషనల్ కొరియర్ సంస్థ ప్రతినిధులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు .పోలీసులు వెళ్లి గాజుల డబ్బాలు స్వాధీన పరుచుకుని తనిఖీచేయగా అందులో డ్రగ్స్ బయటపడ్డాయి.. మూడు కిలోల పైచిలుకు ఉండే డ్రగ్స్ ని అధికారులు స్వాధీనపరుచుకున్నారు.
గత కొన్ని నెలల వ్యవధిలోనే 21సార్లు ఇలా డ్రగ్స్ ని గాజులు, అలంకార వస్తువులు, చీరలు పట్టువస్తాలతో కలిపి పంపించారని తెలిపారు. దాదాపు 100 కోట్ల పైచిలుకు డ్రగ్స్ ని కొన్ని నెలల్లోనే ఇరవై ఒక్కసార్లు పార్సల్ట్స్ రూపంలో డ్రగ్స్ ని విదేశాలకు పంపించి వేశారని పోలీసులు చెప్పారు. ఆస్ట్రేలియా న్యూజిలాండ్ తో పాటు పలు దేశాలకు వీళ్ళు డ్రగ్స్ ని ఇంటర్నేషనల్ కొరియర్ ద్వారా పంపిస్తున్నట్టుగా అధికారులు వెల్లడించారు.. శివగంగలో డ్రగ్స్ తయారుచేసి సప్లై ద్వారా వివిధ ప్రాంతాలకు పంపించి అక్కడి నుంచి నేరుగా విదేశాలకు ఇంటర్నేషనల్ కొరియర్ ద్వారా డ్రగ్స్ ని పంపించి వేస్తున్నారని పోలీసులు చెప్పారు. అందరూ కూడా తమిళనాడులోనే మఖం వేశారని పోలీసులు వెల్లడించారు. శివగంగలో ఉండి డ్రస్సు తయారుచేస్తున్న వారిని త్వరలోనే పట్టుకుంటామని హైదరాబాద్ నార్కోటిక్ కంట్రోల్ టీం అధికారులు వెల్లడించారు.
Read Also: Top Headlines @9PM: టాప్ న్యూస్