Hyderabad: ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌లో పాస్ పోర్ట్ సేవా కేంద్రం ప్రారంభమైంది.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సేవలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే మొట్టమొదటి సారిగా మెట్రో స్టేషన్‌లో పాస్ పోర్ట్ సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.. పాస్ పోర్ట్ ఇవ్వడంలో దేశంలోనే హైదరాబాద్ ఐదవ స్థానంలో ఉందన్నారు.. తెలంగాణలో ఇప్పటి వరకు ఐదు పాస్ పోర్ట్ సేవ కేంద్రాలు ఉన్నాయని వివరించారు.. తెలంగాణాలో రోజుకు 4500 పాస్ పోర్టులు ఇచ్చే సౌకర్యం ఉంది.. కానీ 1200-1400 వందలే ఇస్తున్నారని.. దీన్ని విస్తరించాలని సూచించారు.. బయట దేశాలకు వెళ్తే భారతీయులుగా మన గుర్తింపు పాస్ పోర్ట్ అని మంత్రి చెప్పారు. అవసరం ఉన్న లేకున్నా పాస్ పోర్ట్ తీసుకోవాలని యువతకు సూచించారు. అత్యవసర సమయంలో రావాలంటే వచ్చేది కాదని.. అందుకే ముందే తీసుకోవాలన్నారు. మెట్రో ఎక్కిన.. దిగిన పాస్ పోర్ట్ సేవ కేంద్రం కనబడుతుందన్నారు. పాస్ పోర్ట్ వెరిఫికేషన్ లో ఎటువంటి జాప్యం ఉండదని స్పష్టం చేశారు.. వెరిఫికేషన్ లో ఆలస్యం చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇచ్చామన్నారు..
READ MORE: Non Poisonous Snakes: ఇవి పేరుకు మాత్రమే పాములు.. కాటు వేసినా ఏమీకాదు! పంట దిగుబడికి హెల్ప్
మరోవైపు.. ఈ అంశంపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. “సౌత్ హైదరాబాద్ కు ఈరోజు మంచి శుభవార్త.. సౌత్ హైదరాబాద్ కు పాస్ పోర్ట్ సేవ కేంద్రం అందుబాటులోకి వచ్చింది.. ఈ సేవ కేంద్రం కోసం నేను అనేక సార్లు ప్రభుత్వాన్ని సంప్రదించాను.. ఒకే చోట పాస్ పోర్ట్ సేవలు పొందాలంటే ఇబ్బంది ఉండేది.. గతంలో చెన్నై.. బెంగళూరు.. లక్నో లలోనే పాస్ పోర్ట్ ఆఫీసులు ఉండేవి.. ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు పాస్ పోర్ట్ కావాలంటే చెన్నై వెళ్లాల్సి వచ్చేది.. మన సిటీకి పాస్ పోర్ట్ రీజనల్ ఆఫీస్ వచ్చింది.. సేవ కేంద్రాలను విస్తరిస్తున్నాం.. వీలైనంత వరకు ఈ పాస్ పోర్ట్ ను సంప్రదించండి.. వీలైనంత త్వరగా పాస్ పోర్ట్ ఎంక్వైరీ పూర్తి చేయండని.. లోకల్ పోలీసులను కూడా కోరుతున్నా..” అని వ్యాఖ్యానించారు.
READ MORE: Non Poisonous Snakes: ఇవి పేరుకు మాత్రమే పాములు.. కాటు వేసినా ఏమీకాదు! పంట దిగుబడికి హెల్ప్
