Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?

  • గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం
  • సెప్టెంబర్ 25న మెట్రో సేవలను సెప్టెంబర్ 26 తెల్లవారుజామున 1 గంట వరకు
  • అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి మెట్రో రైలు 1:00 గంటలకు..
Hyderabad Metro

Hyderabad Metro

Hyderabad Metro: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి భారీగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో నగర మెట్రో రైలు సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల సౌకర్యార్థం సెప్టెంబర్ 25న హైదరాబాద్ మెట్రో రైలు సేవలను సెప్టెంబర్ 26వ తేదీ తెల్లవారుజామున 1 గంట వరకు పొడిగించింది. దీంతో నిమజ్జన వేడుకలకు వెళ్లే భక్తులు రాత్రివేళ కూడా మెట్రో సేవలను వినియోగించుకోవచ్చు.

సెప్టెంబర్ 25న అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి మెట్రో రైలు తెల్లవారుజామున 1:00 గంటలకు బయలుదేరుతుందని మెట్రో అధికారులు వెల్లడించారు. నిమజ్జనం సందర్భంగా నగరంలోని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు, భారీ రద్దీ ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు ప్రజా రవాణాను వినియోగించుకోవాలని సూచించారు.

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో వినాయక విగ్రహాలు శోభాయాత్రగా హుస్సేన్ సాగర్ వైపు తరలివస్తాయి. ఖైరతాబాద్ మహాగణపతితో పాటు వేలాది విగ్రహాల నిమజ్జనాన్ని వీక్షించేందుకు నగరవాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు నగరానికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ, వాహనాల రాకపోకలపై ఆంక్షలు, పార్కింగ్ సమస్యలు తలెత్తే అవకాశం లేకుండా.. సొంత వాహనాల్లో వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా మెట్రో సేవలను వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.