Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

Metro

Metro

Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో రెండో దశపై కేంద్ర ప్రభుత్వం సూత్రపాయ అంగీకారం తెలిపింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో జరిగిన సమావేశంలో హైదరాబాద్ మెట్రో రెండో దశపై కేంద్రమంత్రి మనోహర్లాల్ కట్టర్ కీలక అంశాలను ప్రస్తావించారు. మెట్రో రెండో దశకు సంబంధించిన డీపీఆర్, కేంద్ర ప్రభుత్వం పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం L&T సంస్థ నుంచి టేకేవర్ చేసుకుందని.. హైదరాబాద్ మెట్రో రెండోదశ ప్రాజెక్టుకు సూత్రప్రాయంగా కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదని మనోహర్లాల్ కట్టర్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 ఖర్చుచేసే ప్రాతిపదికన కేంద్రం ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 162 కిలోమీటర్ల మేర మెట్రో రెండోదశ విస్తరణకు ప్రతిపాదనలు సమర్పించినట్లు పేర్కొన్న ఆయన.. దానిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తదుపరి చర్యలు చేపడుతుందని వెల్లడించారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని చెప్పారు.