Site icon NTV Telugu

Metro Employees Strike: జీతాలు పెంచాలని హైదరాబాద్‌ మెట్రో ఉద్యోగుల సమ్మె

Hyderabad Metro

Hyderabad Metro

Metro Employees Strike: హైదరాబాద్‌ మెట్రో ఉద్యోగులు సమ్మెకు దిగారు. జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు పూనుకున్నారు. నేడు సగం మంది ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరయ్యారు. ఉద్యోగుల సమ్మెతో ఇప్పటికే హైదరాబాద్‌ మెట్రోపై ఎఫెక్ట్ పడింది. రెడ్ లైన్ – మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు మెట్రో స్టేషన్‌లలో టికెట్ వ్యవస్థ స్తంభించింది.

Big Breaking: ఏపీ సర్కార్‌ సంచలన నిర్ణయం.. సభలు, ర్యాలీలపై నిషేధం

మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు రెడ్ లైన్ టికెటింగ్ ఉద్యోగులు విధులను బహిష్కరించారు. 5 ఏళ్లుగా జీతాలు పెంచడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్లుగా 11 వేల రూపాయల సాలరీ మాత్రమే కంపెనీ ఇస్తోందని వాపోతున్నారు. 15 వేల నుంచి 18 వేల రూపాయల వరకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అమీర్‌పేట్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో టికెట్ల కోసం ప్రయాణికులు భారీగా క్యూ కట్టారు.

Exit mobile version