Site icon NTV Telugu

Lovers Suicide: “నువ్వు లేని లోకంలో నేను ఉండలేను బంగారం”.. ప్రేమ జంట ఆత్మహత్య..

Subside

Subside

Lovers Suicide: ఇద్దరూ ప్రేమించుకున్నారు…!! చదువు పూర్తయ్యాక పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు !! ఇంతలోనే ప్రియురాలు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న ప్రియుడు కూడా మంచిర్యాలలో ఆత్మహత్య చేసుకున్నాడు. నువ్వు లేని లోకంలో నేను ఉండలేను బంగారం అంటూ… సూసైడ్‌ నోట్‌ రాసి మరీ చనిపోయాడు. తెలిసీ తెలియని వయసులో పుట్టిన ప్రేమ… ఇద్దరినీ బలికోరింది. ఇంతకు ఆ యువతి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నట్టు !! ఇద్దరి ఆత్మహత్య వెనకా దాగున్న మిస్టరీ ఏంటి..?

READ MORE: Whatsapp Group: దొంగను పట్టించిన వాట్సప్‌ గ్రూప్‌.. వాట్సపా మజాకా..

హైదరాబాద్‌… బీబీనగర్‌-ఘట్‌కేసర్‌ రైల్వే ట్రాక్‌పై ఓ యువతి ట్రైన్‌కి ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. గమనించిన లోకో పైలెట్‌ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు.. యువతి బ్యాగ్‌లో దొరికిన ఐడీ కార్డ్‌ ఆధారంగా వివరాలు సేకరించారు. యువతి ఘట్‌ కేసర్‌ పరిధిలోని విజ్ఞాన్‌ కాలేజ్‌లో ఇంజినీరింగ్‌ చదువుతున్న దుంపటి హిత వర్షిణిగా గుర్తించారు. పేరెంట్స్‌కి సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. యువతి సొంతూరు మంచిర్యాల జిల్లా.. దండేపల్లి మండలం రాజంపేట. హిత వర్షిణి సొంతూరైన రాజంపేటలో వినయ్‌ అనే యువకుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వినయ్‌ రాసిన సూసైడ్‌ లెటర్‌తో అసలు విషయం బయటపడింది. హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న హిత వర్షిణితో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నానని.. తన ప్రియురాలు ఆత్మహత్య చేసుకోవడం తట్టుకోలేకే తానూ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు 3 పేజీల సూసైడ్‌ నోట్‌ రాసి పెట్టాడు. దాన్ని స్వాధీనం చేసుకున్నారు మంచిర్యాల పోలీసులు..

READ MORE: Siachen Tragedy: సియాచిన్‌లో విషాదం.. ఆర్మీ అధికారులను బలిగొన్న మంచు

లక్షెట్టిపేట మండలం కొమ్ముగూడెం పంటపొలాల్లో ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు వినయ్‌. సూసైడ్‌ లెటర్‌ ఆధారంగా కేసు నమోదు చేసుకుని… పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని ఏరియా హాస్పిటల్‌కి తరలించారు పోలీసులు. తాను ప్రేమించిన హిత వర్షిణి లేని లోకంలో తాను ఉండలేనని… పైలోకంలో హిత వర్షిణి ఒంటరిగా ఉండలేదని, అందుకే తానూ ఆత్మహత్య చేసుకుని హిత వర్షిణి దగ్గరికి వెళ్తున్నాను అంటూ లెటర్‌లో రాశాడు వినయ్‌. ఎప్పటికీ తోడుగా ఉంటానని హిత వర్షిణికి మాటిచ్చానని.. అందుకే చావులోనూ తోడుగా వెళ్తున్నాను అంటూ తన ప్రేమను వ్యక్తపరుస్తూ 3 పేజీల నోట్‌ రాశాడు. కేసు నమోదు చేసుకున్న మంచిర్యాల పోలీసులు, సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వర్షిణి కాల్‌ డేటాను పరిశీలించగా.. ఆత్మహత్యకు ముందు చివరగా వినయ్‌తోనే మాట్లాడినట్లు గుర్తించారు పోలీసులు. ఐతే… వర్షిణి ఆత్మహత్య ఎందుకు చేసుకుంది? అనే కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడం వల్లే ఆత్మహత్య చేసుకున్నారా..? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అని పోలీసులు విచారిస్తున్నారు.

Exit mobile version