Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Hyderabad Man Injects Hiv Blood Into Woman Marriage Rejection Movie Inspired Crime

Hyderabad Horror: పెళ్లికి నిరాకరించిందని యువతికి హెచ్‌ఐవీ రక్తం ఎక్కించిన ఉన్మాది!

Published Date :March 14, 2026 , 10:02 pm
By Shiva Ganesh
Hyderabad Horror: పెళ్లికి నిరాకరించిందని యువతికి హెచ్‌ఐవీ రక్తం ఎక్కించిన ఉన్మాది!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Hyderabad Horror: ప్రియురాలిని పగబట్టాడు.. పెళ్లికి నిరాకరించిందన్న కక్షతో కన్నూ మిన్నూ కానకుండా.. ఎవరూ చేయని పని చేశాడు. చివరికి యువతి, ఆమె తండ్రి ఫిర్యాదుతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇంతకీ ఆ కంత్రీగాడు ఎవరు? ఏం చేశాడు? యవత సినిమాలు చూసి చెడిపోతున్నారా? లేక బాగుపడుతున్నారా..? ఈ చర్చను కాసేపు పక్కకు పెడితే.. యువతపై సినిమాల ప్రభావం మాత్రం ఎక్కువగా ఉంటుందన్నది వాస్తవం. ఈ క్రమంలో సినిమాల నుంచి మంచి కంటే ఎక్కువగా చెడునే తీసుకుంటున్నారు. ఫలితంగా సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయి. సరిగ్గా అలాంటి ఘటనే ఇప్పుడు హైదరాబాద్‌లో జరిగింది. ఇటీవల విడుదలై విజయం సాధించిన రాజు వెడ్స్ రాంబాయి సినిమాను ఆదర్శంగా తీసుకున్న ఓ యువకుడు.. అత్యంత క్రూరమైన నేరానికి పాల్పడ్డాడు.

READ ALSO: KTR : మూసీ మీద 15 బ్రిడ్జిలు.. బీఆర్ఎస్ ప్లానింగ్ చెప్పిన కేటీఆర్

రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో పెళ్లికి అంగీకరించని యువతి తల్లిదండ్రులు.. యువకుడికి హెచ్ఐవీ రక్తం ఎక్కిస్తారు. సరిగ్గా అదే తరహాలో ఏకంగా తన ప్రియురాలిపైనే పగబట్టాడు ప్రియుడు. పెళ్లికి నిరాకరించిందనే కారణంతో యువతికి హెచ్ఐవీ రక్తం ఎక్కించాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్‌‌లో కలకలం రేపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువతి ఎదులాబాద్‌లోని ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న ఆమెకు కుటుంబ సభ్యుల పరిచయంతో మనోహర్ అనే యువకుడితో నిశ్చితార్థం జరిగింది. ఇద్దరు కూడా సమీప బంధువులవుతారు. పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో వైద్య పరీక్షల్లో మనోహర్‌కు హెచ్ఐవి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో యువతి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ పెళ్లికి నిరాకరించారు. ఈ నిర్ణయాన్ని మనోహర్ అంగీకరించలేకపోయాడు.

మార్చి 11న అన్నోజిగూడ ప్రాంతంలో ఉంటున్న యువతి ఇంటికి వెళ్లాడు మనోహర్. తనను పెళ్లి చేసుకోవాలని యువతిపై ఒత్తిడి తెచ్చాడు. అయితే యువతి పెళ్లికి నిరాకరించడంతో ఆగ్రహానికి గురయ్యాడు. కానీ అంతకు ముందే కంత్రీ ప్లాన్ వేసుకుని వచ్చాడు. ముందే రెడీ చేసుకున్న ప్లాన్ ప్రకారం.. యువతికి హెచ్ఐవీ పాజిటివ్ ఉన్న రక్తం ఎక్కించి పారిపోయాడు. ఈ ఘటన అనంతరం యువతికి జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకుపోయారు. ఐతే పదేపదే జ్వరం ఎందుకు వస్తుందని యవతిని డాక్టర్లు అడిగారు. దీంతో డాక్టర్ల ఒత్తిడితో మనోహర్ సిరంజి ద్వారా హెచ్ఐవి రక్తాన్ని ఎక్కించినట్లు తెలిపింది. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు మనోహర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు యువతి ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది. గతంలోని మనోహర్ తండ్రి హెచ్ఐవి సోకి మరణించాడు. తల్లికి కూడా హెచ్ఐవి ఉంది. హెచ్ఐవి ఉన్న నేపథ్యంలో తనతో పెళ్లికి నిరాకరించిందని భావించిన మనోహర్.. ఆమెకు కూడా హెచ్ఐవీ ఉంటే తనను పెళ్లి చేసుకుంటుంది అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమెకు బలవంతంగా ఇంజక్షన్ ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తెలిపాడు. ఈ సంఘటన సమాజంలో హెచ్ఐవి వంటి వ్యాధులపై అవగాహన ఎంత అవసరమో మాత్రమే కాకుండా, సంబంధాలలో నిజాయితీ లేకపోతే అది ఎంత పెద్ద విషాదానికి దారి తీస్తుందో చూపించింది. ప్రేమ, పెళ్లి వంటి బంధాలు పరస్పర గౌరవం, బాధ్యతలపై నిలబడాలి గానీ ప్రతీకారం, కోపంతో తీసుకునే నిర్ణయాలు అమాయకుల జీవితాలను నాశనం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

READ ALSO: Rishabh Pant: తగ్గేదే లే అంటున్న రిషబ్ పంత్! ఐపీఎల్ వేళ సంచలన మార్పులు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Cinema influence on youth crimes
  • Engineering student HIV victim
  • Forced HIV infection case Telangana.
  • HIV blood injection Hyderabad latest
  • Hyderabad HIV injection case

తాజావార్తలు

  • Hyderabad Horror: పెళ్లికి నిరాకరించిందని యువతికి హెచ్‌ఐవీ రక్తం ఎక్కించిన ఉన్మాది!

  • KTR : మూసీ మీద 15 బ్రిడ్జిలు.. బీఆర్ఎస్ ప్లానింగ్ చెప్పిన కేటీఆర్

  • Chandrababu: అల్లు ఇంటికి ఆంధ్రా సీఎం

  • Rishabh Pant: తగ్గేదే లే అంటున్న రిషబ్ పంత్! ఐపీఎల్ వేళ సంచలన మార్పులు..

  • Train Accident: ఘోర రైలు ప్రమాదం.. కాలేజీ బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు..

ట్రెండింగ్‌

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions