NTV Telugu Site icon

Hyderabad Doctor: సరదాగా ఈత కోసం నదిలోకి దూకిన లేడి డాక్టర్.. చివరకు?

Docter

Docter

Hyderabad Doctor: కర్ణాటకలోని హంపి వద్ద హైదరాబాద్‌కు చెందిన లేడీ డాక్టర్ అనన్య రావు విషాదకరంగా మృతి చెందింది. విహారయాత్ర కోసం స్నేహితులతో కలిసి వెళ్లిన అనన్య రావు, సరదా కోసం తుంగభద్ర నదిలో ఈత కొట్టేందుకు దూకింది. అయితే కొద్ది సేపటికే నీటి ప్రవాహం పెరగడంతో ఆమె అదుపుతప్పి కొట్టుకుపోయింది. రెండు రోజుల క్రితం అనన్య రావు తన స్నేహితులతో కలిసి హంపికి విహారయాత్రకు వెళ్లింది. ఆ సమయంలో సరదాగా గడపాలని భావించిన ఆమె, తుంగభద్ర నదిలో ఈత కొట్టేందుకు దిగింది. ఈత కొడుతూ ఉన్న సమయంలో నది ప్రవాహం తీవ్రంగా ఉండటంతో ఆమె నీటిలో కొట్టుకుపోయింది. స్నేహితులు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించినా, ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఆమె అదృశ్యమైంది.

Read Also: Kashmiri MBBS Student: ఎంబీబీఎస్ విద్యార్థిని ర్యాగింగ్.. సిద్ధరామయ్యకు లేఖ రాసిన జమ్మూ సీఎం

స్నేహితులు వెంటనే అధికారులకు సమాచారం అందించగా.. ఫైర్ డిపార్ట్‌మెంట్ సహాయక చర్యలు చేపట్టింది. గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత అనన్య రావు మృతదేహాన్ని తుంగభద్ర నదిలో నుంచి వెలికి తీశారు. ఈ ఘటన ఆమె కుటుంబసభ్యులను, స్నేహితులను తీవ్ర విషాదంలో ముంచేసింది. అనన్య రావు హైదరాబాద్‌లోని ప్రముఖ డాక్టర్ కుమార్తె. నగరంలోని ఆసుపత్రి వర్గాలు, అనన్యను వ్యక్తిగతంగా కలిసిన వారు ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన అందరికీ గుణపాఠంగా మారుతోంది. విహారయాత్రలు సంతోషంగా గడపాలని అనుకునే వారు, నీటి ప్రవాహం ఉన్న ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.