NTV Telugu Site icon

IT Recruitment: ఐటీలో ఉద్యోగాల కల్పనలో దేశంలోనే టాప్‌ ప్లేస్ లో హైదరాబాద్‌..

It

It

ప్రపంచంలో నలమూలల్లో ఐటీ రంగం ప్రస్తుతం కుదేలవుతున్న పరిస్థితి అందరికి తెలిసిందే. ఇక మన భారత దేశంలో ఐటీ రంగంలో కొత్త నియామకాలు క్రమక్రమంగా తగ్గుతున్న.. అందుకు విరుద్ధంగా హైదరాబాద్ మాత్రం ఐటి జోరును కొనసాగిస్తుంది. గడిచిన ఏప్రిల్ నెలలో హైదరాబాదులో ఏకంగా 41.5% ఐటి నియామకాలు పెరిగినట్లు ఇన్ డీడ్ అనే ఆన్లైన్ జాబ్స్ వచ్చింది సంస్థ నివేదికను వెలువడించింది. ఈ నివేదికలో హైదరాబాద్ తర్వాత బెంగళూరు స్థానాన్ని సంపాదించింది. బెంగళూరులో 24% నియామకాలు పెరిగినట్లు తన నివాదికలో పేర్కొంది.

Liquor Policy : ఢిల్లీ తర్వాత ఇప్పుడు కేరళలో మద్యం పాలసీపై వేడెక్కుతున్న రాజకీయాలు

ఇక ఇన్ డిడ్ ప్రకటించడం నివేదిక ప్రకారం.. హైదరాబాదులో పని చేసేందుకు 161 శాతం మంది ఉద్యోగతులు ఆసక్తిని చూపిస్తున్నారని., అలాగే 80 శాతం మంది బెంగళూరు పై ఆసక్తి చూపిస్తున్నట్లు పేర్కొంది. కాకపోతే., ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక పరిస్థితి కారణంగా ఐటి నియామకాలు జరిపేందుకు కంపెనీలు ఇష్టపడట్లేదని తెలిపింది. ఈ నివేదికలో దేశంలో 3.6శాతం ఐటీ రిక్రూట్మెంట్ తగ్గినట్లు పేర్కొంది.

Graduate MLC By-Election: రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్.. ఇలా చేస్తే ఓటు చెల్లదు

ప్రస్తుత టెక్నాలజీ నేపథ్యంలో ఎక్కువగా ఏఐ సాంకేతిక రంగంలో నియామకాలు జరుగుతున్నాయని పేర్కొంది. దీంతో ఏఐ నైపుణ్యం కలిగిన ఉద్యోగాలతో ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నాయి. ఇలాంటి వారికి ఏకంగా 50% పైన అధిక వేతనాలు ఇవ్వడానికి కంపెనీలు వెనుకంజ వేయడం లేదు.

Show comments