Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Hyderabad Illegal Constructions Hyra Demolitions Kukatpally Puppalaguda

HYDRA : మరోసారి రంగంలోకి హైడ్రా.. ఈ సారి కూకట్‌పల్లిలో

Published Date :May 19, 2025 , 12:33 pm
By Gogikar Sai Krishna
  • కూకట్‌పల్లి డైమండ్ ఎస్టేట్‌లో 9 ఎకరాల అక్రమ లేఅవుట్‌పై హైడ్రా చర్యలు
  • పుప్పాలగూడ డాలర్ హిల్స్‌లో పార్కులు, రహదారులపై ఆక్రమణల తొలగింపు
  • కోర్టు తీర్పులపై కూడా ఖచ్చితంగా అమలు చేస్తోన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
HYDRA : మరోసారి రంగంలోకి హైడ్రా.. ఈ సారి కూకట్‌పల్లిలో
  • Follow Us :
  • google news
  • dailyhunt

HYDRA : హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా నగరంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లోని ఆక్రమిత నిర్మాణాలను తొలగిస్తూ చర్యలు చేపట్టారు. మొదటగా కూకట్‌పల్లి నియోజకవర్గం హైదర్‌నగర్ పరిధిలోని డైమండ్ ఎస్టేట్ లేఅవుట్‌లోని అక్రమ కట్టడాలపై హైడ్రా అధికారులు ధర్మయుద్ధం ప్రారంభించారు. సర్వే నంబర్ 145లో ఉన్న 9 ఎకరాల లేఅవుట్‌ను అన్‌రిజిస్టర్డ్ అగ్రిమెంట్‌ ఆధారంగా ఆక్రమించారని, స్థానికులు ఆరోపించారు. ఈ ప్రాంతంలో మొత్తం 79 ప్లాట్లు, వాటికి సంబంధించిన పార్కులు, రహదారులు కబ్జాకు గురైనట్లు ప్లాట్ యజమానులు ప్రజావాణి ద్వారా ఫిర్యాదు చేశారు.

ఈ ప్లాట్లు 2000లో మధ్యతరగతి కుటుంబాల‌కు అమ్ముడైపోయినవే. అయితే ఆ స్థలంపై శివ దుర్గాప్రసాద్ అనే వ్యక్తి హక్కు చూపిస్తూ అక్రమంగా కబ్జా చేశారని, దీనికి సంబంధించి 2024లో హైకోర్టు బాధితుల అనుకూలంగా తీర్పునిచ్చినా చర్యలు లేకపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక, ఆ స్థలాన్ని దశాబ్దాలుగా ఇతరులకు అద్దెకు ఇచ్చి నెలకు రూ.50 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నాడంటూ ప్లాట్ యజమానులు ఆరోపించారు.

Shashi Tharoor: కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారిన శశిథరూర్! వేటుపై తర్జనభర్జనలు

ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ. రంగనాథ్ స్వయంగా రంగంలోకి దిగారు. గత బుధవారం ఆయన సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. పరిశీలనలో హెచ్ఎండీఏ లేఅవుట్‌లో పార్కులు, రహదారులు ఆక్రమించబడ్డట్లు తేలింది. వెంటనే బుల్డోజర్ల సహాయంతో సోమవారం ఉదయం పోలీసు బందోబస్తు మధ్య నిర్మాణాలను కూల్చివేశారు.

ఇక మరోవైపు మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పుప్పాలగూడలోని డాలర్ హిల్స్ లేఅవుట్‌లో కూడా హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాల తొలగింపు చర్యలు చేపట్టారు. అక్కడ రోడ్లు, పార్కులు ఆక్రమించి నిర్మాణాలు చేసినట్లు ఆరోపణలు రావడంతో కమిషనర్ రంగనాథ్ బుధవారం అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు.

ఇటీవలి కాలంలో పాత లేఅవుట్‌ను రద్దు చేసి వ్యవసాయ భూమిగా మార్చి ఎన్‌సీసీ సంస్థకు అప్పగించినట్లు సమాచారం. విచారణ సందర్భంగా ఇరుపక్షాల నుంచి వివరాలు సేకరించిన హైడ్రా, పార్క్ స్థలం, రహదారులు అక్రమంగా ఆక్రమించబడ్డాయని నిర్ధారించింది. ఇక అక్కడ అనుమతుల్లేకుండానే నిర్మాణాలు జరుగుతున్నట్లు స్పష్టమైన నేపథ్యంలో, తాత్కాలికంగా పనులను నిలిపివేసి, నిర్మాణాలను కూల్చివేసింది.

Viral News : పుటాణీ హీరోలు.. మానవత్వాన్ని కదిలించిన ఇద్దరు చిన్నారుల కథ..!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AV Ranganath
  • HMDA
  • hyderabad
  • HYRA
  • illegal constructions

తాజావార్తలు

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

  • Chodavaram TDP Clash: టీడీపీ వర్సెస్ టీడీపీగా పంచాయితీ.. చోడవరంలో ఏం జరుగుతోంది?

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions