Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganja Party Busted: హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని చంద్రాయణగుట్ట బండ్లగూడ ప్రాంతంలో గంజాయి పార్టీ నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. క్రిస్టల్ టౌన్‌షిప్‌లోని ఓ నివాస గృహంపై ప్రత్యేక బృందాలు ఆకస్మికంగా దాడులు నిర్వహించి గంజాయి వినియోగిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నాయి.
రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రత్యేక తనిఖీల్లో.. ప్రముఖ ఆయుర్వేద వైద్యుడిగా గుర్తింపు పొందిన డాక్టర్ అతావుల్లా ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గంజాయి పార్టీ నిర్వహిస్తున్న సమయంలో డాక్టర్ అతావుల్లాతో పాటు గంజాయి సేవిస్తున్న మరో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడుల సందర్భంగా నిందితుల వద్ద నుంచి సుమారు 220 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఊటీ, కొడైకెనాల్ ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకొచ్చి పార్టీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Also Read
- Yogi-Modi Meeting: మోడీ-యోగి భేటీ.. యూపీ ఎన్నికల వేళ కీలక పరిణామం..
- New Bus Stands: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. తెలంగాణలో మరో 13 కొత్త బస్టాండ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
- TGTET Results 2026: తెలంగాణ ఇన్-సర్వీస్ ఫలితాలు విడుదల.. 70 శాతం దాటిన ఉత్తీర్ణత..!
- Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని వైద్య పరీక్షల కోసం పంపించారు. మెడికల్ రిపోర్టులు వచ్చిన తర్వాత చట్టపరమైన తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఈ ఘటనతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో డ్రగ్స్, గంజాయి వినియోగం, సరఫరాపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Yogi-Modi Meeting: మోడీ-యోగి భేటీ.. యూపీ ఎన్నికల వేళ కీలక పరిణామం..
-
New Bus Stands: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. తెలంగాణలో మరో 13 కొత్త బస్టాండ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
Satya Master: “నాలుగు ఎలుకల కోసం మ్యాన్షన్నే తగలబెడతారా?” జానీ మాస్టర్ భార్యపై సత్య మాస్టర్ సంచలన కామెంట్స్!
-
Chiranjeevi: చిరూ లీక్స్ మెగా జోష్.. కాకా షూటింగ్ గురించి మాస్ లీక్ ఇచ్చిన మెగాస్టార్!
-
TGTET Results 2026: తెలంగాణ ఇన్-సర్వీస్ ఫలితాలు విడుదల.. 70 శాతం దాటిన ఉత్తీర్ణత..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?