NTV Telugu Site icon

Fire Accident: పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. ప్రాణ భయంతో కార్మికులు పరుగులు!

Fire Accident

Fire Accident

హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఐఎస్ సదన్ పోలీసు స్టేషన్ పరిధి మాదన్నపేట చౌరస్తాలోని ఓ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు తోడు నల్లటి పొగ ఆ ప్రాంతమంతా దట్టంగా వ్యాపించింది. మంటలను చూసి పరిశ్రమలోని కార్మికులు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. అగ్నిప్రమాదంను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని.. 6 ఫైరింజిన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

సోఫా మరియు తలుపులను తయారు చేసే పరిశ్రమలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీ మంటలకు పరిశ్రమలోని వస్తువులు పూర్తిగా కాలి బూడిదైపోయాయి. షార్ట్ సర్క్యూట్ ద్వారానే అగ్నిప్రమాదం జరిగిందని అగ్నిమాపక శాఖ సిబ్బంది అంటున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగ్గపోవడం సంతోషించాల్సిన విషయం.

Also Read: Telangana Assembly 2024 Live Updates: తెలంగాణ అసెంబ్లీ లైవ్ అప్‌డేట్స్!

సికింద్రాబాద్‌లో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మోండా మార్కెట్ పూజ సామాగ్రి దుకాణంలో మంటలు చెలరేగాయి. నాలుగు దుకాణాలకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. పూజ సామాగ్రి దుకాణంతో పాటు ప్లాస్టిక్ దుకాణం మంటల్లో కాలిపోయాయి.