Drugs : డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అరెస్ట్
- బెంగుళూరు నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి నగరంలో విక్రయిస్తున్న నలుగురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు
- వీరి వద్ద నుంచి 6.65 గ్రాముల ఎండీ ఎమ్ఏ డ్రగ్స్, 2.27 గ్రాముల గంజాయి, 8.57 గ్రాముల హ్యష్ ఆయిల్ స్వాధీనం
- నలుగురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drugs : అమీర్‌పేట్ ఎక్సైజ్ పోలీసులు బెంగుళూరు నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి నగరంలో విక్రయిస్తున్న నలుగురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి వద్ద నుంచి 6.65 గ్రాముల ఎండీ ఎమ్ఏ డ్రగ్స్, 2.27 గ్రాముల గంజాయి, 8.57 గ్రాముల హ్యష్ ఆయిల్ మరియు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ ఇన్స్‌పెక్టర్ వివరాల ప్రకారం, కేరళకు చెందిన సంజయ్, శ్రీజిత్, ఆదర్శ్ అనే యువకులు ఎస్‌ఆర్ నగర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నారు. వీరు ఆఫీస్ సమీపంలోని ఓ బాయ్స్ హాస్టల్‌లో నివసిస్తూ డ్రగ్స్ వ్యాపారంలో పాల్గొన్నారు.
CM Chandrababu: పీడీఎస్ అక్రమ రవాణాపై ప్రభుత్వం సీరియస్.. సీఎం కీలక ఆదేశాలు
Also Read
- Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
వీరి డ్రగ్స్ వ్యాపారం అనుసంధానంగా, హైదరాబాద్‌లోని న్యూబోయిన్‌పల్లికి చెందిన అజయ్ అనే వ్యక్తితో వీరి పరిచయం ఏర్పడింది. డ్రగ్స్ వినియోగానికి బానిసలుగా మారిన వీరు, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టారు. బెంగళూరు నుంచి డ్రగ్స్‌ను నగరానికి రహస్యంగా తీసుకొచ్చి విక్రయానికి సిద్ధమయ్యారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా పోలీసులు ప్రత్యేక దాడులు చేపట్టి, ఈ నలుగురిని డిసెంబర్ 11న అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఆపరేషన్‌లో సబ్ ఇన్స్‌పెక్టర్లు రాధ, బాలరాజు, బిక్షారెడ్డి ముఖ్య పాత్ర పోషించారు.
అదేవిధంగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చడంపై దృష్టి సారించారు. ఆయన, డ్రగ్స్ వినియోగం మరియు విక్రయం నివారించేందుకు, ఉక్కుపాదంతో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు సినిమా తారలను సైతం కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి మరియు అల్లు అర్జున్ వంటి ప్రముఖులు డ్రగ్స్ వల్ల కలిగే వీడియోలు రూపొందించి విడుదల చేశారు. ఈ చర్యలు డ్రగ్స్ సమస్యను అరికట్టడంలో కీలకమవుతాయని ప్రభుత్వం విశ్వసిస్తోంది.
తాజావార్తలు
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?